logo

  BREAKING NEWS

RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |  

చైనాకు గుడ్ బై.. భారత్ కు దగ్గరయ్యే ప్రయత్నం.. టిక్ టాక్ మళ్ళీ వస్తుందా?

ప్రస్తుతం భారత దేశంలో టిక్ టాక్ ను పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. చైనాతో భారత్ కు సరిహద్దు వివాదాలు ఉండటం, ఈ సంస్థ సర్వర్లు కూడా చైనాలో ఉన్న కారణంగా భారత దేశ భద్రతకు ముప్పు ఉందని భావించిన కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టిక్ టాక్ సంస్థ భారీగా నష్టపోయింది. ఈ యాప్స్ మాతృసంస్థ అయిన బైట్ డాన్స్ ఏకంగా 45 వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది.

ఇపుడు మన దేశం బాటలోనే మిగతా దేశాలు కూడా టిక్ టాక్ ను బ్యాన్ చేసే విధంగా అడుగులు వేస్తున్నాయి. దీంతో ఈ సంస్థ ఇప్పుడు మరోసారి భారత్ లో అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. అందుకు అగ్రదేశమైన అమెరికా సాయం కోరినట్టుగా తెలుస్తుంది. ఒక వేళ టిక్ టాక్ తన సంస్థను చైనా నుంచి తొలగించుకుని అమెరికా చేతుల్లో పెడితే అప్పుడు భారత్ కు దగ్గరయ్యే అవకాశం ఉంది. అయితే తొందర్లోనే టిక్ టాక్ దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుంది.

ఇటీవల వైట్ హౌస్ ఆర్థిక సలహాదారుడు ల్యారీ కుడ్లో ఇందుకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. టిక్‌టాక్‌ తన మాతృ సంస్థ బైట్‌డాన్స్ నుంచి విడిపోయి అమెరికా సంస్థగా సేవలు కొనసాగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయన మాటలను బట్టి ఇది నిజమేనని తెలుస్తుంది. అయితే టిక్ టాక్ ను అమెరికాకు చెందిన సంస్థలు సొంతం చేసుకోనున్నాయా? అనే ప్రశ్నకు మాత్రం వారి నుంచి స్పష్టమైన సమాధానం ఏమీ రాలేదు. కానీ టిక్ టాక్ అమెరికా కంపెనీగా ఏర్పడితే భారత్ దీనిపై నిషేధం ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News