తెలుగు సినిమా పాటలకు తనదైన స్టయిల్లో స్టెప్పులేస్తూ అలరించే దుర్గారావు తెలుగువారందరికీ పరిచయమయ్యాడు. టిక్ టాక్ సెన్సేషన్ గా ఓ వెలుగు వెలిగాడు. ఆ తర్వాత ఆ యాప్ ను బ్యాన్ చేయడంతో ఇప్పుడు వీడియోలు చేయడం మానేసాడు. కానీ యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ మళ్ళీ అభిమానుల ముందుకొచ్చాడు.
గతంలో దుర్గారావు చేసిన టిక్ టాక్ ఇదేవులా కారణంగా ఏకంగా సినిమా అవకాశాలే దక్కించుకుంటున్నాడు. ఇటీవల రవితేజ క్రాక్ సినిమాలో ఓ సన్నివేశంలో కనిపించాడు. తాజాగా జగపతిబాబు ఫక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఈవెంట్ లో హీరో జగపతి బాబుతో కలిసి దుర్గారావు స్టెప్పులేశాడు.
దీంతో మరింత పాపులర్ అయిపోయాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు దుర్గారావు కు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5 కోసం నిర్వాహకులు దుర్గారావును సంప్రదించారని వార్త గట్టిగానే వినిపిస్తుంది. ఇప్పటికే ఈ షోలో యాంకర్ రవి, యూట్యూబ్ స్టార్ షన్ను, హైపర్ ఆదిల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక దుర్గారావు కూడా హౌస్ లోకి అడుగుపెడితే ఈ సారి ఎంటర్టైన్మెంట్ మరో స్థాయిలో ఉంటుందనే చెప్పాలి. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.