logo

భారతీయుల డేటా చైనాకు.. నిషేధం పై స్పందించిన టిక్ టాక్

చైనా యాప్ అయిన టిక్ టాక్ ను అధికంగా ఉపయోగించే వారిలో భారతీయులు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే ఈ యాప్ ను 54 మిళియన్లకు పైగా వినియోగిస్తున్నారు. భారత సంప్రదాయాలను వ్యతిరేకిస్తూ.. అశ్లీలతను ప్రేరేపించే విధంగా టిక్ టాక్ వీడియోలు ఉంటున్నాయని కొంతకాలంగా భారతీయుల నుంచి దీనిపై వ్యతిరేకత వినిపిస్తుంది.

మరోవైపు చైనా యాప్ ల ద్వారా భారత సమగ్రతకు ముప్పు పొంచి ఉందని, దేశభద్రత, రక్షణ దృష్ట్యా టిక్ టాక్ తో సహా భారత్ లోని 54 చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిపై తాజాగా భారత్ లోని టిక్ టాక్ యాజమాన్యం స్పందించింది. తాము ఏ తప్పూ చేయలేదని, యూజర్ల సమాచారం దుర్వినియోగం కాకుండా చూసుకోవడమే తమ ప్రధాన లక్ష్యంగా పనిచేశామని వివరణ ఇచ్చింది.

తాము భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నామని అనడంలో ఎలాంటి వాస్తవం లేదాని పేర్కొంది. కాగా తమకు భారత ప్రభుత్వం సంబంధిత అధికారులతో చర్చలకు ఆహ్వానించిందని ఈ సందర్భంగా తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి వ్యక్తం చేస్తామని, ప్రభుత్వానికి ఏవైనా సందేహాలు ఉంటె నివృత్తి చేస్తామని తెలిపింది.

14 భాషల్లో టిక్ టాక్ యాప్ వినియోగంలో ఉందని ఈ యాప్ లో విద్యావంతులు, సెలబ్రిటీలు, వివిధ రంగాల్లో నిపుణులైన వారితో సహా మొదటి సారి ఇంటర్ నెట్ ను వినియోగిస్తున్న వారు కూడా ఉన్నారని వారి ప్రైవసీకి తాము అత్యున్నత ప్రాముఖ్యం ఇచ్చామని తెలిపింది.

Related News