logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

టిక్‌టాక్ ల‌వ‌ర్స్‌కు గుడ్ న్యూస్‌.. భార‌త్‌లోకి మళ్లీ వ‌చ్చే ఛాన్స్‌..!

ప్ర‌ముఖ‌ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్‌కు మ‌న దేశంలో పెద్ద ఎత్తున యూజ‌ర్స్ ఉండేవారు. 2017లో ప్రారంభ‌మైన ఈ యాప్ త‌క్కువ‌ కాలంలోనే దేశంలో కోట్లాది మంది స్మార్ట్ ఫోన్ల‌లోకి చేరింది. అయితే ఈ యాప్ ఎంత త్వ‌ర‌గా వ‌చ్చిందో, అంతే త్వ‌ర‌గా వెళ్లిపోయింది. చైనాకు చెందిన ఈ యాప్‌ను మ‌న ప్ర‌భుత్వం బ్యాన్ చేయ‌డంతో టిక్ టాక్ ఆగిపోయింది. మ‌న యూజ‌ర్ల డేటాను ఈ చైనా యాప్ చైనాకు చేర‌వేస్తోంద‌ని, దేశ భ‌ద్ర‌త రీత్యా ఈ యాప్ ముప్పు కాబ‌ట్టి భార‌త్ టిక్ టాక్‌ను నిషేధించింది.

టిక్ టాక్‌కు ప్ర‌పంచంలో ఎక్కువ మంది యూజ‌ర్లు ఉన్న‌ది భార‌త్‌లోనే. ఎక్కువ ఆదాయం వ‌చ్చేది కూడా భార‌త్ నుంచే. భార‌త్‌లో ఈ యాప్‌ను నిషేధించడంతో టిక్ టాక్‌ను యాప్ యాజ‌మాని అయిన బైట్ డ్యాన్స్ తీవ్రంగా న‌ష్ట‌పోతోంది. భార‌త్‌లోకి మ‌ళ్లీ అడుగుపెట్టాల‌ని భావిస్తున్న ఈ కంపెనీ అవ‌స‌ర‌మైతే త‌మ సంస్థ‌ను చైనా నుంచి లండ‌న్‌కు మార్చాల‌నే ఆలోచ‌న‌తోనూ ఉంది. ఇంత‌లో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ టిక్ టాక్‌కు మారో షాక్ ఇచ్చారు. భార‌త్ బాట‌లోనే త‌మ దేశంలో ఈ యాప్‌ను నిషేధిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం అమెరికా – చైనాకు న‌డుమ ట్రేడ్ వార్ న‌డుస్తోంది. చైనాను ఎక్క‌డ ఛాన్స్ దొరికితే అక్క‌డ తొక్కేద్దామా అని అమెరికా భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో టిక్ టాక్‌పై అమెరికా గురి పెట్టింది. టిక్ టాక్‌ను లొంగ‌దీసుకునేలా అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. సెప్టెంబ‌ర్ 15 నాటికి టిక్ టాక్ యాప్‌ను ఏదైనా అమెరికా కంపెనీకి అమ్మేయ‌క‌పోతే అమెరికాలో కూడా టిక్ టాక్‌ను నిషేధిస్తామ‌ని ట్రంప్ సంచ‌ల‌న వార్నింగ్ ఇచ్చారు.

ఇంత‌లో అమెరికాకు చెందిన ప్ర‌ముఖ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓ, మ‌న తెలుగు వ్య‌క్తి స‌త్య నాదెళ్ల రంగంలోకి దిగారు. టిక్ టాక్‌ను మైక్రోసాఫ్ట్ కొనేసేలా ఆయ‌న చ‌ర్చ‌లు ప్రారంభించారు. టిక్ టాక్ యాజ‌మాని అయిన బైట్‌డ్యాన్స్ కంపెనీతో స‌త్య నాదెళ్ల చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. మొద‌ట టిక్ టాక్‌లో 30 శాతం వాటాల‌ను మైక్రోసాఫ్ట్ కొనాల‌ని భావించింది. మ‌రిన్ని అమెరికా కంపెనీలు కూడా టిక్ టాక్‌లో వాటాలు కొన‌డానికి ముందుకురావాల‌ని మైక్రోసాఫ్ట్ సూచించింది.

అయితే, డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌తో సీన్ మారింది. 30 శాతం కాదు మొత్తం టిక్ టాక్‌నే అమెరికా కంపెనీ కొనేయాల‌ని ట్రంప్ అంటున్నారు. స‌త్య నాదెళ్ల కూడా ట్రంప్‌తో స‌మావేశ‌మై ఈ విష‌యంపై చ‌ర్చించారు. ఒక‌వేళ టిక్ టాక్ సంస్థ‌ను మైక్రోసాఫ్ట్ కొనేస్తే అది ఇక చైనా యాప్‌గా ఉండ‌దు. అమెరికా యాప్ అవుతుంది. అందునా మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గ‌జ సంస్థ ఈ యాప్‌కు ఓన‌ర్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ అంటే అన్ని దేశాల‌కు మంచి న‌మ్మ‌కం. కాబ‌ట్టి, ఈ కంపెనీ ఆధ్వ‌ర్యంలో టిక్ టాక్ న‌డిస్తే ఎవ‌రికీ ఏ అభ్యంత‌రం ఉండక‌పోవ‌చ్చు. భార‌త్ కూడా మైక్రోసాఫ్ట్ న‌డిపించే యాప్‌ను నిషేధించే అవ‌కాశాలు త‌క్కువే. కాబ‌ట్టి సెప్టెంబ‌ర్ 15 లోపు టిక్ టాక్‌ను మైక్రోసాఫ్ట్ కొనేస్తే మ‌ళ్లీ ఈ వీడియో షేరింగ్ యాప్ భార‌త్‌లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Related News
%d bloggers like this: