logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

భర్త దుర్మార్గం: ‘నాన్నను మర్చిపో అమ్మా..’ తల్లిని ఓదార్చిన చిన్నారి

పెళ్ళై భార్య, కూతురు ఉన్న ప్రబుద్దుడు రెండో వివాహం చేసుకుని మొదటి భార్యను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. దీంతో బాధితురాలు తిరుపతి పోలీస్ స్టేషన్ ఎదురుగా తనకు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. ఈ ఘటనలో బాధితురాలి ఎనిమిదేళ్ల కుమార్తె ఆవేదన స్థానికులను కంట తడి పెట్టిస్తుంది. తండ్రిని మర్చిపోవాలని తనకు తండ్రి అవసరం లేదని తల్లిని రావద్దని ఆ చిన్నారి తల్లిని ఓదార్చే ప్రయత్నం చేసింది.

వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పెద్ద కాపు వీధికి చెందిన వెంకట చలపతికి సరస్వతితో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి 8 ఏళ్ల కూతురు ఉంది. రెండేళ్ల క్రితం భర్త రెండో వివాహం చేసుకున్నాడన్న విషయం సరస్వతికి తెలిసింది. దీంతో ఈ విషయమై భర్తతో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో చలపతి రెండో భార్యను ఏకంగా ఇంటికే తెచ్చి పెట్టాడు. రెండో భార్య, ఆమె బంధువులు కలిసి సరస్వతిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని రోడెక్కింది.

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. పోలీసులు సరస్వతి భర్తను పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించి వెంటనే అక్కడి నుండి పంపించేశారు. దీంతో పోలీసులు కూడా తనకు తనకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు రోడ్డుపై బైఠాయించింది. పోలీసులు బాధితురాలిని స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆమె అందుకు అంగీకరించలేదు.

రెండో భార్యతో స్టేషన్ కు వచ్చిన భర్తను అడ్డుకునే ప్రయత్నం చేసింది. తల్లితో పాటు కూతురు కూడా తండ్రికి తమ వద్దకు వచ్చేయాలని తండ్రిని వేడుకుంది. అయినా ఆ కసాయి తండ్రి అక్కడి నుంచి బండిపై వెళ్ళిపోయాడు. దీంతో బాధితురాలు రోదనలు మిన్నంటాయి. ఆమె కూతురు తల్లిని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ‘నాన్నకు విడాకులు ఇచ్చి కేసు పెడదాం అమ్మా.. నువ్వు ఏడవకు . నాకు నాన్న అవసరం లేదు. నాన్నను మర్చిపో’ అంటూ బతిమాలింది. ఈ ఘటనతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related News