తిరుపతిలో దారుణం జరిగింది. అదనపు కట్నం తీసుకురాలేదని భార్య నగ్నఫోటోలను కాలేజీ గ్రూపులో షేర్ చేసాడు ఓ వ్యక్తి. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులను ఆశ్రయిచగా వారు పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. తిరుపతిలోని ఎస్జిఎస్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రేవంత్ ఐదు నెలల క్రితం నిరోషా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇవ్వలేమని తర్వాత పెళ్లి పెట్టుకుందామని ఆమె తల్లిదండ్రులు చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నాడని ఆ తర్వాత కొద్ది రోజులకే కట్నం తేవాలను తనను వేధిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు గర్భవతి అని కూడా చూడకుండా రేవంత్ విచక్షణా రహితంగా దాడి చేయడంతో అబార్షన్ జరిగిందని ఆమె పేర్కొంది.
ఇటీవల నిరాశకు సంబందించిన నగ్న ఫోటోలను వీడియోలను రేవంత్ తన కాలేజీ గ్రూపులో పోస్ట్ చేసాడు. భార్యను కాల్ గర్ల్ అంటూ అందరికీ పరిచయం చేసాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు దిశా పోలీసులను ఆశ్రయిచింది. అయితే పోలీసులు తన గోడు పట్టించుకోలేదని ఇప్పుడు ఆ వీడియోలు బయటకు రావడంతో హడావిడి చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. పోలీసుల తీరుపై స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది.