logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!

కరోనా మహమ్మారి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై పడగ విప్పుతుంది. కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకోసం ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని కాపాడుకోవాలని, మంచి ఆహారాన్ని తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేద నిపుణులు భారీ శుభవార్తను వినిపించారు. తిప్పతీగతో కరోనా మాహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవచ్చనే భరోసాని కల్పిస్తున్నారు. అందుకు కారణం తిప్పతీగలో ఉండే ఔషధ గుణాలే. ఇప్పటివరకు ఈ విషయం చాలా మందికి తెలియదు. కరోనా కారణంగా ఒక్కసారిగా దీని ప్రయోజనాలు వెలుగులోకి వచ్చాయి.

శరీరంలో సహజంగా రోగ నిరోధకశక్తిని పెంచడంలో ఈ తీగ , దీని ఆకులు కీలకపాత్ర పోషిస్తాయి. దీనినే మరో విధంగా అమృత, గడూచి అనే పేర్లతో పిలుస్తారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల్లో తిప్పతీగ ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నుంచి రక్షణ పొందాలంటే తిప్పతీగను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

తిప్పతీగ ఆకులను నూరి వాటితో గోలి సైజు ఉండలు కట్టాలి. 10 రోజుల పాటు వీటిని ఉదయం సాయంత్రం తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి వస్తుందని అది కోవిడ్ మహమ్మారితో పోరాడటానికి అవసరమైన సామర్థ్యాన్ని పెంచుతుందని ఢంకాఫళంగా చెప్తున్నారు. ఈ మాత్రలు తీసుకుంటే జ్వరం రాదని, వచ్చినా వెంటనే తగ్గిపోతుందని అంటున్నారు. దీంతో ఆయుర్వేద శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తిప్పతీగతో మందులు చేయించి అందుబాటులోకి తెస్తుంది.

ఇవి మార్కెట్లో ‘శంశమినివటి’ పేరుతో అందుబాటులో ఉంచినట్లుగా పేర్కొంది. తిప్పతీగ శరీరంలో సైటోకైన్ల ఉత్పత్తిని పెంచి యాంటీ జెన్ ల ప్రతిస్పందనలు ఉత్తేజం చేస్తుంది. దీంతో వీటిని తీసుకున్నవారు కరోనాతో సులభంగా పోరాడవచ్చు. ఒక్క కరోనాకే కాదు తిప్పతీగతో మధుమేహం, కిడ్నీ వ్యాధులతో పాటుగా ఉబ్బసం, దగ్గు, జలుబు, టాన్సిల్స్, శ్వాసకోశ సమస్యలు, కీళ్లనొప్పుల వంటి ఎన్నోరకాలైన రోగాలకు చెక్ పెట్టవచ్చు.

Related News