logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

గూగుల్‌లో వీటి గురించి సెర్చ్ చేస్తే మీ ప‌ని గోవిందా..!

ఇంట‌ర్నెట్ అనేది అర‌చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌నం గూగుల్‌పైన ఆధార‌ప‌డ‌టం పెరిగిపోయింది. చిన్న చిన్న విష‌యాల నుంచి కీల‌కమైన స‌మాచారం వ‌ర‌కు అన్ని గుగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకోవ‌డం అనేది మ‌న‌లో చాలామందికి అల‌వాటుగా మారింది. ఈ విష‌యంలో గూగుల్ మ‌న‌కు బాగానే ఉప‌యోగ‌ప‌డుతుంది. కానీ, గూగుల్‌లో కొన్నింటి గురించి వెతికితే మాత్రం మీరు చిక్కుల్లో ప‌డ‌తారు. తెలుసో తెలియ‌క మ‌నం వెతికే కొన్నింటి వ‌ల్ల మ‌నం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అస‌లు గూగుల్‌లో ఏవి సెర్చ్ చేయొద్దో చూద్దాం.

1. ఇంట‌ర్నెట్‌లో చాలా ఫేక్ బ్యాంకింగ్ వెబ్‌సైట్లు ఉన్నాయి. మ‌నం ఏదైనా బ్యాంకు వెబ్‌సైట్‌ను గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. అస‌లు వెబ్‌సైట్ బ‌దులు దొంగ వెబ్‌సైట్ కూడా వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. ఈ వెబ్‌సైట్‌లోకి మ‌నం వెళితే మ‌న ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ డిటైల్స్‌, పాస్‌వార్డ్‌ను కాజేస్తారు. త‌ర్వాత మ‌న డ‌బ్బులు సులువుగా కొట్టేస్తారు కేటుగాళ్లు. కాబ‌ట్టి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయాల‌నుకుంటే నేరుగా ఆ బ్యాంకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సైట్ యూఆర్ఎల్‌నే టైప్ చేయాలి.

2. ఏదైనా క‌స్ట‌మేర్ కేర్ నంబ‌ర్‌ను గూగుల్‌లో వెత‌క‌డం చాలా మంది చేస్తుంటాం. కానీ, ఇది కూడా మంచిది కాదు. చాలా మంది ఆన్‌లైన్ మోస‌గాళ్లు ఇంట‌ర్నెట్‌లో వారికి సంబంధించిన నెంబ‌ర్ల‌ను క‌స్ట‌మ‌ర్ కేర్ నెంబ‌ర్లుగా పెడ‌తారు. మ‌నం అవే అస‌లైన నెంబ‌ర్లుగా భావించిన ఫోన్ చేసి వివ‌రాలు చెబితే మ‌న‌ల్ని మోసం చేస్తారు. క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్ కావాలంటే సంబంధిత సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తీసుకోవాలి కానీ గూగుల్‌లో సెర్చ్ చేయ‌వ‌ద్దు.

3. స్మార్ట్‌ఫోన్లు వాడే వారు ఏదైనా యాప్ కావాలంటే గూగుల్‌లో అస్స‌లు సెర్చ్ చేయ‌వ‌ద్దు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఫేక్ యాప్‌లు, వైర‌స్‌, మాల్‌వేర్‌తో కూడిన యాప్‌లు క‌నిపించే ప్ర‌మాదం ఉంది. వాటిని గుర్తించ‌లేక డౌన్‌లోన్ చేసుకుంటే మ‌న‌కు చాలా ఇబ్బందులు వ‌స్తాయి. కాబట్టి, ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకుంటే నేరుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి ఐఫోన్ వినియోగ‌దారులైతే యాప్ స్టోర్‌కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

4. ఆశ్లీల వీడియోలు, ఫోటోలు, వెబ్‌సైట్‌ల‌ను గూగుల్‌లో అస్స‌లు సెర్చ్ చేయొద్దు. ఇలా చేశారంటే మీరు జైల్లో ఊచ‌లు లెక్క‌పెట్టే ప్ర‌మాదం ఉంటుంది. పోర్నోగ్ర‌ఫీని దేశంలో బ్యాన్ చేసినందున వీటి కోసం సెర్చ్ చేయ‌డం చ‌ట్ట వ్య‌తిరేకం అవుతుంది. ముఖ్యంగా పిల్ల‌లకు సంబంధించి అశ్లీల వీడియోలు, ఫోటోల‌ను వెతికితే మాత్రం క‌చ్చితంగా జైల్లో ప‌డ‌తారు. ఇలా వెతికే వారి ప‌ట్ల సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పుడూ దృష్టి పెడ‌తారు. తాజాగా హైద‌రాబాద్‌లో ఇద్ద‌రు యువ‌కులు ఇలానే వెతికి అరెస్ట్ అయ్యారు.

5. గూగుల్‌లో డిస్కౌంట్ కూప‌న్లు, ఆన్‌లైన్ షాపింగ్ కూప‌న్ల కోసం వెత‌కొద్దు. కొంద‌రు మోస‌గాళ్లు త‌క్కువ ధ‌ర‌కు ఎక్కువ విలువ చేసే కూప‌న్లు అమ్ముతామ‌ని వెబ్‌సైట్‌లు తెరిచి మోసం చేస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు 1000 రూపాయ‌ల కూన్ 200 కే ఇస్తామంటారు. మ‌నం ఈ కూప‌న్ కొని షాపింగ్ చేస్తున్న‌ప్పుడు కూప‌న్ ప‌ని చేయ‌ద‌ని తెలిసి మోస‌పోతాం. అంతేకాదు, ఇలా న‌క‌లీ సైట్ల‌లో మ‌నం పేమెంట్ చేస్తే మ‌న బ్యాంకు డీటైల్స్‌ను కాజేసి పెద్ద ఎత్తున ఫ్రాడ్ చేసే ప్ర‌మాద‌మూ ఉంది.

6. గూగుల్‌లో యాంటీ వైర‌స్ యాప్‌ల‌ను సైతం సెర్చ్ చేయ‌వ‌ద్దు. కొన్ని నకిలీ సైట్లు అస‌లు సైట్ల‌ను పోలి ఉంటాయి. మ‌నం న‌మ్మేసి డౌన్‌లోడ్ చేసుకుంటే అవి వైర‌స్‌ను తీసుకువ‌చ్చే ఛాన్స్ ఉంది. ఒక్కోసారి మ‌న కంప్యూట‌ర్ హ్యాక్ కూడా అవ్వొచ్చు.

7. ప్ర‌భుత్వ వెబ్‌సైట్ల‌ను కూడా గూగుల్‌లో సెర్చ్ చేయ‌కుండా నేరుగా యూఆర్ఎల్‌నే టైప్ చేసి వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. గూగుల్‌లో ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌ల గురించి సెర్చ్ చేస్తే కొన్ని న‌కిలీ వెబ్‌సైట్‌లు కూడా వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. వీటి ద్వారా మ‌నం ఏవైనా చెల్లింపులు చేస్తా ఆ డ‌బ్బులు మోస‌పోయిన‌ట్లే అవుతుంది.

8. గూగుల్‌లో మందులు, ఆరోగ్య సమస్య‌‌ల గురించి సెర్చ్ చేయ‌డం కూడా అంత మంచిది కాదు. అనారోగ్యం బారిన ప‌డిన‌ప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేసి మందులు వాడటం లేదా డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా ఉండ‌టం ప్ర‌మాదక‌రం. ఎలా బ‌రువు త‌గ్గాలి, ఎలా బ‌రువు పెర‌గాలి వంటి విష‌యాలు కూడా గూగుల్‌లో సెర్చ్ చేయ‌వ‌ద్దు.

Related News