logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

అతనికి మాత్రమే ఇస్తా.. రౌడీ హీరోపై తమన్నా కామెంట్స్ వైరల్

సమంత అక్కినేని వ్యాఖ్యాతగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ఆహా వేదికగా సామ్ జామ్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరై తమ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాగా తాజాగా ఈ షోకి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హాజరైంది. అందుకు సంబందించిన ప్రోమో ఒకటి ఆసక్తికరంగా మారింది.

కాగా షోలో భాగంగా సమంత తమన్నాను కొన్ని కొంటె ప్రశ్నలు అడిగింది. గ్లామరస్ గా కనిపించడానికి వెనకాడని తమన్నాను తెలుగు సినిమా తెరపై ముద్దులు పెట్టుకునే హద్దు చెరిపేస్తే ఏ హీరోతో లిప్ కిస్ సీన్ చేస్తుందని అడిగింది. అందుకు సమాధానంగా తమన్నా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. దీంతో వీక్షకులంతా ఒక్కసారిగా కేరింతలతో హోరెత్తించారు. కాగా ఇదే ప్రశ్న తమన్నాకు గతంలో కూడా ఓ షోలో ఎదురవ్వగా అప్పుడు ఆమె బాలీవుడ్ హీరో హ్రితిక్ రోషన్ పేరు చెప్పింది.

తర్వాత అక్కినేని వారసుడు అఖిల్ పై హీరోయిన్లు ఇద్దరు ముచ్చటించుకున్నారు. సమంత మాట్లాడుతూ.. అఖిల్ వయసులో నీకన్నా చిన్నవాడైపోయాడు అనడంతో ప్రేమకి వయసుతో సంబంధం లేదని తమన్నా షాకింగ్ రిప్లై ఇచ్చింది. నీకు ఇష్టమైతే వాళ్ళ నాన్నతో మాట్లాడతానంటూ సమంత ఆటపట్టించింది. ఈ మధ్య కవిత్వం పై దృష్టి పెట్టినట్టున్నావని అడగగా ప్రేమ విఫలమైందంటూ తమన్నా చమత్కరించింది.

 

Related News