logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

వారికి మద్దతుగా తమన్నా ఫోటో ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు..!

నటి తమన్నా భాటియాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల ఆమె చేసిన ఓ ట్వీట్ అందుకు కారణం. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ప్లాయిడ్ హత్యపై నిరసనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన తమన్నా.. ‘నీ మౌనం నిన్ను కాపాడదు. మనిషి అయినా జంతువైనా ప్రతి ఒక్కరి జీవితం ముఖ్యమే కదా? మనిషి మనిషిగా ప్రేమ, జాలి, కరుణతో జీవించడం మళ్ళీ నేర్చుకోవాలి’ అంటూ ట్వీట్ చేసింది.

వారికీ మద్దతు తెలుపుతూ ముఖానికి నలుపు రంగు పూసి ఉన్న తన ఫోటోను జత చేసింది. ఈ ట్వీట్ పై కొందరు ఆమెను అభినందిస్తుండగా మరికొందరు నెటిజన్లు మాత్రం ‘ఈ మాటలు నువ్వు చెబుతున్నావా’ అంటూ మండిపడుతున్నారు. గతంలో తమన్నా కొన్ని ఫెయిర్ నెస్ క్రీములను ప్రమోట్ చేస్తూ పలు యాడ్ లలో కనిపించింది.

ఇప్పుడు ఆ ఫోటోలను ట్వీట్ చేస్తూ తెల్లగా కనిపించాలంటే ఈ క్రీములు వాడండి అని చెప్పిన నువ్వు నల్ల జాతీయులపై అహంకారం వద్దంటున్నావా అంటూ కడిగిపారేస్తున్నారు. తాను ట్వీట్ చేసిన ఈ ఫోటో ఇలాంటి విమర్శలకు గురికావడం తమన్నాకు షాకిచ్చింది.

Related News