logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

రాజ‌కీయాల్లోకి టీజీవో నాయ‌కురాలు మ‌మ‌త ? ఆ కీల‌క‌ ప‌ద‌వి ఆమెకే ?

ఉద్యోగ సంఘాల నాయ‌కులు రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించ‌డం కొత్త కాదు. చాలామంది ఉద్యోగ నాయకులు ప‌ద‌వీవిర‌మ‌ణ చేశాక లేదా వీఆర్ఎస్ తీసుకొని రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఉద్యోగ నేత‌లు రాజ‌కీయాల్లోకి రావ‌డం మ‌రింత పెరిగింది. ఉద్య‌మ స‌మ‌యంలో నేటి ముఖ్య‌మంత్రి, నాటి ఉద్య‌మ‌నేత కేసీఆర్‌తో క‌లిసి ఉద్యమంలో భాగ‌మైన టీజీవో, టీఎన్‌జీవో నేత‌లు త‌ర్వాతి కాలంలో రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు.

టీఎన్‌జీవో నేత‌గా ప‌నిచేసిన స్వామిగౌడ్ శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ అయ్యారు. టీజీవో నేత శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయ్యారు. మ‌రో నేత దేవి ప్ర‌సాద్ ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఇలా టీజీవో, టీఎన్‌జీవో నేత‌లు టీఆర్ఎస్ ద్వారా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తున్నారు. వీరికి టీఆర్ఎస్ పార్టీ కూడా మంచి ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇప్పుడు మ‌రో టీజీవో నాయ‌కురాలు టీఆర్ఎస్ ద్వారా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

శ్రీనివాస్ గౌడ్ రాజ‌కీయాల్లోకి ప్రవేశించిన త‌ర్వాత టీజీవో సంఘం అధ్య‌క్షురాలిగా ప్ర‌స్తుతం మ‌మ‌త కొన‌సాగుతున్నా‌రు. ఆమె ఇప్పుడు జీహెచ్ఎంసీలో కూక‌ట్‌ప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. మ‌మ‌త ప్ర‌స్తుతం రాజ‌కీయాల వైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మేయ‌ర్ సీటు సాధించ‌డ‌మే ఆమె ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

త‌మ సంఘానికి మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుత మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాట‌లో మ‌మ‌త కూడా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. ఇందుకు గానూ ఇప్ప‌టికే ఆమె ప్ర‌య‌త్నాలు కూడా మొద‌లుపెట్టార‌ట‌. ప్ర‌స్తుతం జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా బొంతు రామ్మోహ‌న్ ఉన్నారు. ఇప్పుడు మేయ‌ర్ పీఠం జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు రిజ‌ర్వు అయ్యింది. కాబ‌ట్టి బొంతు రామ్మోహ‌న్‌కు మ‌రోసారి మేయ‌ర్ అయ్యే అవ‌కాశం లేదు.

దీంతో మ‌మ‌త ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. మున్సిప‌ల్ శాఖ అధికారినిగా ఆమె సుదీర్ఘ‌కాలం జీహెచ్ఎంసీలో డిప్యూటీ క‌మిష‌న‌ర్‌గా, జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప‌ని చేశారు. దీంతో న‌గ‌రంపై, న‌గ‌రాభివృద్ధిపై ఆమెకు మంచి అవ‌గాహ‌న ఉంది. ఇది ఆమెకు ప్ల‌స్ కానుంది. టీజీవో నాయ‌కురాలిగా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తోనూ ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి.

వీటి ద్వారా ఆమె టీఆర్ఎస్ మేయ‌ర్ క్యాండిడేట్‌గా అవ‌కాశం పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ఈ డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రిలో జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఒక‌వేళ మేయ‌ర్‌గా త‌న‌కు అవ‌కాశం ఇస్తామ‌ని టీఆర్ఎస్ పెద్ద‌ల నుంచి భ‌రోసా ల‌భిస్తే ఆమె వీఆర్ఎస్ తీసుకొని ఎక్క‌డినుంచైనా కార్పొరేట‌ర్‌గా పోటీ చేయ‌వ‌చ్చు. జీహెచ్ఎంసీ పీఠాన్ని టీఆర్ఎస్ ద‌క్కించుకుంటే ఆమె మేయ‌ర్ అయ్యే అవ‌కాశ‌మూ ఉండ‌వ‌చ్చని తెలుస్తోంది.

Related News