logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఆ ఉద్యోగిపైనే అంత ‘మ‌మ‌తా’నురాగం ఎందుకు..?

ఉద్యోగ సంఘాల నేతలు అంటే ఉద్యోగుల సంక్షేమం, హ‌క్కుల‌కై పోరాడాలి. అవ‌స‌ర‌మైతే ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాలి. పోరాటానికి దిగాలి. ఇందుకు స్వంత ప్ర‌యోజ‌నాల‌ను ఫ‌ణంగా పెట్టాలి. కానీ, తెలంగాణ‌లో మాత్రం ఉద్యోగ సంఘాల నేత‌లు ఇందుకు రివ‌ర్స్‌లో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా ఓ ఉద్యోగి స‌ర్వీసును రెండేళ్లు పొడిగిస్తూ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోనే ఇందుకు కార‌ణం.

తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగ సంఘం నేత మ‌మ‌త భ‌ర్త చింత‌నిప్పు వెంక‌టేశ్వ‌ర్లు స‌ర్వీసు పొడిగిస్తూ గ‌త నెల 28న రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. హైద‌రాబాద్‌లోని గ‌వ‌ర్న‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెద‌ర్ టెక్నాల‌జీలో ఆయ‌న‌ కెమెస్ట్రీ సీనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఆయన గ‌త నెల 31న రిటైర్ కావాల్సి ఉంది. కానీ, మూడు రోజుల‌కు రిటైర్ అవుతార‌న‌గా తెలంగాణ ప్ర‌భుత్వం ఓ జీవో జారీ చేసింది. ఈ జీవో ప్ర‌కారం ఆయ‌న స‌ర్వీసు రెండేళ్లు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

నిజానికి తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు రెండేళ్లు పెంచుతామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్పుడో హామీ ఇచ్చారు. కానీ, ఈ హామీ ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు కాలేదు. ఆయ‌న హామీ ఇచ్చి సుమారు రెండేళ్లు కావొస్తుంది. ఈ హామీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి వంద‌ల మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యారు. వీరెవ‌రి స‌ర్వీసును రెండేళ్లు పొడిగించ‌లేదు. కానీ, ఇప్పుడు టీజీఓ నేత మ‌మ‌త భ‌ర్త వెంక‌టేశ్వ‌ర్లు స‌ర్వీసు రెండేళ్లు ఎందుకు పొడిగించార‌నేది ఉద్యోగుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

పైగా వెంక‌టేశ్వ‌ర్లు స‌ర్వీసు పొడిగింపు జీవోలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగ సంఘం రిఫ‌రెన్స్‌ అని స్ప‌ష్టంగా పేర్కొన్నారు. దీంతో వెంక‌టేశ్వ‌ర్లు భ‌ర్త మ‌మ‌త నాయ‌కురాలిగా ఉన్న టీజీఓ రిఫ‌రెన్స్ ద్వారానే ప్ర‌భుత్వం ఈ జీవో జారీ చేసింది అనేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఉద్యోగ సంఘం నేత‌గా ఉంటూ అంద‌రి హ‌క్కుల‌కై పోరాడ‌కుండా ఇలా స్వంత వారి ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేయ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు ఉద్యోగుల నుంచి వ‌స్తున్నాయి. ఉద్యోగ సంఘం నేతల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

నిజానికి తెలంగాణ ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉంది. పీఆర్సీ, ఐఆర్ రావ‌డం లేదు. ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు కావ‌డం లేదు. ఇటీవ‌ల లాక్‌డౌన్ కార‌ణంగా రాష్ట్ర ఆదాయం ప‌డిపోయింద‌నే కార‌ణంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాల్లో ప్ర‌భుత్వం కోత పెడుతోంది. వీట‌న్నింటిపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది. వీటిపై పోరాడాల‌ని, ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌ల‌పై ఒత్తిడి ఉంది. ఈ స‌మ‌యంలో ఇలా టీజీఓ నాయ‌కురాలి భ‌ర్త స‌ర్వీసు పొడిగింపు విమ‌ర్శ‌లకు తావిస్తోంది.

Related News