logo

భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమావేశం!

భారత్ – చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 45 ఏళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య రక్తపాతం చోటుచేసుకుంది. భారత్ – చైనా సరిహద్దు వివాదంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే చైనా దళాలు భారత సైనికులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికాధికారి సహా ఇద్దరు సైనిక సిబ్బంది మృతి చెందారు.

ఈశాన్య దిక్కున ఉన్న గల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ త్సోలోని ఎల్ఏసీ వైపు చైనా దళాలు అధిక సంఖ్యలో శిబిరాలు ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడి నుంచి తొలగిపోవాలని సైన్యం హెచ్చరించడంతో ఇరు వర్గాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) వెంబడి అనేక ప్రాంతాల్లో భారత్‌, చైనా దళాల మధ్య నెల రోజులుగా ఈ వివాదం నడుస్తుంది.

చైనా కాల్పుల చర్యను భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ఢిల్లీలో భారత రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. సరిహద్దుల్లో ఉన్న భారత ఆర్మీని అప్రమత్తం చేసింది. చైనాకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు సరిహద్దుల్లోకి మరిన్ని బలగాలను తరలిస్తోంది.

Related News