logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

ఏం చేసిందని ఆ హీరోయిన్ కు గుడి కట్టారు?

తమిళ ప్రేక్షకులకు సినిమాలకు విడదీయలేని అనుబంధం ఉంది. వారికి నచ్చితే ఆ నటీ నటులను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తుంటారు. అలా చాలా మంది హీరోహీరోయిన్లకు గుడి కట్టేశారు. ఈ లిస్టులో నటి కుష్బూ, నమిత లాంటి వారు ఉన్నారు. తాజాగా తమిళ తంబీలు మరో హీరోయిన్ కు గుడి కట్టారు.

నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఇటీవల ఆమె నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ సక్సెస్ అందుకోవడంతో నిధికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో నిధికి భారీగానే అవకాశాలు వస్తున్నాయి. కానీ అప్పుడే తమిళ ప్రేక్షకులు నిధి అందాలకు ఫిదా అయిపోయారు.

ఆమెకోసం ఏకంగా గుడి కట్టేసారు. నిధి విగ్రహానికి పాలాభిషేకాలు చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఆమె ఏం సాధించిందని గుడి కట్టారని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిధి అభిమానులు మాత్రం లైకులు, షేర్లు చేసేస్తున్నారు.

Related News