logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

టీడీపీ రికార్డు.. టీఆర్ఎస్‌, వైసీపీని దాటేసి 4వ స్థానంలోకి

తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ రాజ‌కీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. తెలంగాణ‌లో కొంద‌రు అభిమానులు మిన‌హా ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ వ‌రుస ఓట‌ములు ఆ పార్టీని కృంగ‌దీస్తున్నాయి. అయితే, ఒక విష‌యంలో మాత్రం తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌, వైసీపీని దాటేసి దూసుకుపోతోంది. ఏకంగా దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో నాలుగో స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది.

రాజ‌కీయ పార్టీల‌కు ఆస్తులు, అప్పులు ఉంటాయి. అసోసియేష‌న్ ఆఫ్ డెమాక్ర‌టిక్ రిఫార్మ్స్ అనే సంస్థ రాజ‌కీయ పార్టీల ఆస్తుల‌ను ప్ర‌తీ యేటా ప్ర‌క‌టిస్తూ ఉంటుంది. ఈ సంవ‌త్స‌రం కూడా ఏ పార్టీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయ‌నేది ప్ర‌క‌టించింది. జాతీయ పార్టీల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ రూ. 2,904 కోట్ల‌తో ఆస్తుల‌తో మొద‌టి స్థానంలో నిలిచింది. రూ.928 కోట్ల‌తో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది.

ఇక ప్రాంతీయ పార్టీల విష‌యానికి వ‌స్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో విప‌క్షంలో ఉన్న స‌మాజ్‌వాదీ పార్టీ రూ.572 కోట్ల ఆస్తుల‌తో మొద‌టి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జ‌న‌తాద‌ళ్ రూ.232 కోట్ల ఆస్తుల‌తో నిలిచింది. ఇక మూడో స్థానంలో ఉన్న‌ త‌మిళ‌నాడు అధికార పార్టీ అన్నా డీఎంకే రూ.206 కోట్ల ఆస్తులు ఉన్నాయి. నాలుగో సంప‌న్న ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచింది. టీడీపీకి రూ.115 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు ఇంకా అనేక ఆస్తులు ఉన్నాయ‌ని ఈ సంస్థ చెప్పింది.

దేశంలోని టాప్ 10 సంపన్న ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్ఎస్‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకి మొత్తం రూ.152 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రూ.79 కోట్ల ఆస్తులు ఉన్న‌ట్లు ఏడీఆర్ సంస్థ నివేదించింది. ఆస్తులే కాదు తెలుగుదేశం పార్టీకి రూ.18 కోట్ల అప్పులు కూడా ఉన్నాయ‌ట‌. రాజకీయంగా వెనుక‌బ‌డుతున్నా ఆస్తుల విష‌యంలో మాత్రం టీడీపీ ముందంజ‌లోనే ఉందన్న మాట‌.

Related News