స్విట్జర్‌ల్యాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు ప్రభుత్వాధినేతలు, ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరవుతుంటారు. ఈసారి కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పలు రాష్ట్రాల మంత్రులు ఆయా రాష్ట్రాల తరపున దావోస్ వెళ్లారు. ఈ సదస్సుకు తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా హాజరుకావడం ఆసక్తికరంగా మారింది.
అయితే, గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీగా దావోస్ వెళ్లలేదు. అమరరాజా బ్యాటరీస్ యాజమానిగా వెళ్లారు. దావోస్‌లో ఆయన కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్ పురితో ఫోటో దిగి ట్వీట్ చేశారు. ఎనర్లీ అవుట్‌లుక్… ఓవర్‌కమ్ ది క్రైసిస్ పేరుతో జరిగిన ప్యానల్ డిస్కషన్‌కు గల్లా హాజరయ్యారు. మరి, దావోస్‌లో జగన్ సారథ్యంలో ఏర్పాటుచేసిన ఏపీ పెవీలియన్‌ను ఆయన సందర్శిస్తారా, లేదా అనేది చూడాలి.
At #Davos for the @wef Annual Meeting. Looking forward to networking & knowledge sharing with participants from across the World.
Started off by attending an insightful panel discussion on “#Energy Outlook: Overcoming the Crisis” & met with Hon Min Shri @HardeepSPuri ji. #WEF22 pic.twitter.com/3cO7vSGi1d
— Jay Galla (@JayGalla) May 23, 2022