logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

తెలుగు టాప్‌ యాంక‌ర్ల రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

మ‌న తెలుగు ప్ర‌జ‌ల‌లో కొంద‌రు యాంక‌ర్ల‌కు చాలా క్రేజ్ ఉంది. వీరికి కూడా అభిమానులు ఉన్నారు. త‌మ‌కు ఇష్ట‌మైన యాంక‌ర్ల కోస‌మే వారి షోల‌ను చూసే తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఉన్నారు. దీంతో యాంక‌ర్లు సెల‌బ్రిటీలుగా మారారు. వీరికి ఉన్న క్రేజ్‌కు త‌గ్గ‌ట్లుగానే రెమ్యున‌రేష‌న్ కూడా భారీగానే ఉంది. ఒక ఆడియో ఫంక్ష‌న్‌కు ఇంత‌, ఒక్క షోకి ఇంత అంటూ యాంక‌ర్లకు బాగానే గిట్టుబాటు అవుతుంది. మన తెలుగునాట టాప్ యాంక‌ర్ల రెమ్యున‌రేష‌న్స్‌ ఎలా ఉన్నాయో మీరూ ఓ లుక్కేయండి.

తెలుగులో టాప్ యాంక‌ర్ అంటే మొద‌ట చెప్పుకునే పేరు సుమ క‌న‌కాల‌. ఎక్క‌డో కేర‌ళ‌లో పుట్టి తెలుగు కుటుంబానికి కోడ‌లైన సుమ త‌క్కువ‌కాలంలో అద్భుతంగా తెలుగు నేర్చుకొని ఏకంగా టాప్ యాంక‌ర్‌గా స్థిర‌ప‌డింది. తెలుగులో టాప్ హీరోల చిత్రాల ఆడియో, ప్రీరిలీజ్ ఫంక్ష‌న్లు, స‌క్సెస్ మీట్‌ల‌కు 90 శాతం సుమ‌నే వ్యాఖ్యాత‌‌గా ఉంటుంది. వీటితో పాటు ప‌లు ఛాన‌ళ్ల‌లో షోస్ చేస్తుంది. ఇలా ఎప్పుడూ బిజీగా ఉండే సుమ బాగానే సంపాదిస్తుంది. ఒక్కో ఆడియో ఫంక్ష‌న్‌కు సుమ దాదాపు రూ.2 నుంచి రూ.3 ల‌క్ష‌లు తీసుకుంటుంది. ఈటీవీలో సుమ చేసే క్యాష్ ప్రోగ్రామ్ ఒక్క ఎపిసోడ్‌కు రూ.2 ల‌క్ష‌లు తీసుకుంటుంది.

సుమ త‌ర్వాత ఇప్ప‌టికైతే తెలుగులో టాప్ రేంజ్‌లో ఉంది జ‌బ‌ర్ద‌స్ట్ అన‌సూయ‌. యూత్‌లో ఆమెకు విపరీత‌మైన క్రేజ్ ఉంది. త‌న అందాల‌తో ఎప్పుడూ హాట్‌గా క‌నిపిస్తూ ఉంటుంది. అన‌సూయ ఒక్కో షోకి సుమారు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది. ఇవే కాకుండా అన‌సూయ ఇంకా సినిమాల్లో కూడా న‌టిస్తూ బిజీగా ఉంటోంది. ఒక్కో ఈవెంట్‌కు కూడా అన‌సూయ సుమారు రూ.2 ల‌క్ష‌లు తీసుకోంటుంది. అయితే, ఈ మ‌ధ్య ఈవెంట్స్ చేయ‌డం లేదు.

జ‌బ‌ర్ద‌స్త్ ద్వారానే యాంక‌ర్‌గా క్లిక్ అయిన ర‌ష్మీకి కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ర‌ష్మీ గౌత‌మ్ ఇప్పుడు సినిమాల్లోనూ న‌టిస్తోంది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌లోనూ బిజీగా గ‌డుపుతోంది. ర‌ష్మీ గౌత‌మ్ క్రేజ్‌కు త‌గ్గ‌ట్లుగానే రెమ్యున‌రేష‌న్ కూడా భారీగా అందుకుంటోంది. ప్ర‌స్తుతం ర‌ష్మీ సుమారు ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ అందుకుంటోంది.

యాంక‌ర్‌గా త‌న టాలెంట్ నిరూపించుకున్న‌ తెలంగాణ పిల్ల శ్రీముఖి బిగ్ బాస్‌లో కూడా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ త‌ర్వాత శ్రీముఖి క్రేజ్ మ‌రింత పెరిగింది. ప్ర‌స్తుతం శ్రీముఖి ఈవెంట్‌ల‌తో పాటు వివిధ ఛాన‌ళ్ల‌లో షోలు కూడా చేస్తోంది. వీటికి శ్రీముఖి దాదాపు ల‌క్ష నుంచి ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ అందుకుంటోంది.

ఎక్కువ‌గా ఈవెంట్‌ల‌కు యాంక‌రింగ్ చేసే యాంక‌ర్ శ్యామ‌ల‌కు కూడా ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు ఉంది. సుమ త‌ర్వాత ఎక్కువ‌గా సినిమా ఫంక్ష‌న్ల‌కు యాంక‌రింగ్ శ్యామ‌ల చేస్తుంది. శ్యామల డీసెంట్ యాంక‌రింగ్‌కు మంచి గుర్తింపే ఉంది. శ్యామ‌ల కూడా బాగానే రెమ్యున‌రేష‌న్ అందుకుంటోంది. ప్ర‌స్తుతం ఆమె ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ.50 వేల నుంచి రూ.1 ల‌క్ష వ‌ర‌కు తీసుకుంటోంది.

Related News