సినిమా హీరోయిన్ల రెమ్యునరేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు తీసుకునే హీరోయిన్లు కూడా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారంటే ఆశ్చర్యపోవడం సహజం. ఇటు టాలీవుడ్ లో కూడా కోటికి పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు హీరోయిన్లు. ఈ వెండితెర సంగతులు పక్కనపెడితే టీవీ సీరియళ్ళలో కనిపించే నటీమణులు కూడా రెమ్యునరేషన్ విషయంలో దూసుకెళ్తున్నారు. బుల్లితెరపై మెరుపుతీగల్లా మెరుస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు.
ఆకట్టుకునే రూపం, మళ్లీ మళ్లీ చూడాలనిపించే గ్లామరస్ ఫిజిక్లు వెండితెరకే కాదు.. బుల్లితెరపైనా అంతకు మించి అన్నట్టుగా తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు. వీళ్ల గ్లామర్‌ని ఇష్టపడి సీరియల్‌ని ఫాలో అయ్యేవాళ్లు కూడా ఉన్నారంటే వాళ్ల క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళ రెమ్యునరేషన్ కూడా కళ్ళుచెదిరే రేంజ్ లో ఉంటుంది. ప్రస్తతం బుల్లితెరను ఏలుతున్న టాప్ అందగత్తెల విషయానికొస్తే..
చంద్రముఖి సీరియల్ తో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన మంజుల, అందులో సహనటుడిగా నటించిన నిరుపమ్ ని పెళ్లి చేసుకుని కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ క్రిష్ణవేణి సీరియల్ తో ఫామ్ లోకి వచ్చింది.. మంజుల ఒక రోజు రెమ్యునరేషన్ఒ క్క ఎపిసోడ్ కు రూ. 8 వేలు.
భార్యామణి సీరియల్ తో సీరియల్స్ బాట పట్టిన పల్లవి రామి శెట్టి ఆ తర్వాత ఆడదే ఆధారం, వసుంధర, మాటే మంత్రము, అత్తారింటికి దారేది లాంటి సీరియల్స్ లో నటించింది. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు మళ్ళీ బిజీగా మారింది ఈ తెలుగమ్మాయి. ప్రస్తుతం ఈమె ఒక్కో ఎపిసోడ్ కు రూ. 15 వేల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
సమీరా షరీఫ్ ‘ఆడపిల్ల’ సీరియల్ ద్వారా తెలుగువారికి పరిచయం అయ్యింది. ఆ సీరియల్ సూపర్ హిట్ తర్వాత..ఆమె తెలుగులో ‘అన్నా చెల్లెల్లు’, ‘భార్యామణి’, ‘Dr. చక్రవర్తి’, ‘ముద్దు బిడ్డ’ మొదలగు చాలా సీరియల్స్‌లో నటించింది. నటిగా నిరూపించుకున్న సమీరా..ఆ తర్వాత నిర్మాతగా మారి తమిళంలో సీరియల్స్‌ను కూడా నిర్మిస్తోంది. తమిళంలో సిరీయల్స్ నిర్మించడమే కాకుండా.. అక్కడి సీరియల్స్లలో కూడ నటిస్తోంది సమీరా. సీనియర్ నటి సనా తనయుడిని ఇటీవలే పెళ్లి చేసుకుంది. ఈమె ఒక్కో ఎపిసోడ్ కు రూ. 10 వేలు తీసుకుంటుంది.
కథలో రాజకుమారి సీరియల్ లో అవని పాత్రలో నటించింది ఆషికా. ప్రస్తుతం అషికా.. త్రినయని అనే సీరియల్ లో నటిస్తోంది. అషికాకు రోజుకు 12 వేల రూపాయల పారితోషికం ఇస్తారట.
హరిత.. వైదేహీ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన హరిత ఎన్నో సీరియల్స్ లో నటించింది. కుంకుమపువ్వు, ముద్దమందారం లాంటి టాప్ సీరియల్స్ లో నటించింది. హరిత ఒక రోజుకి అందుకునే రెమ్యునరేషన్ 12,000 రూపాయలు.
ప్రీతినిగమ్.. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే, సీరియల్స్ లో కూడా సరైన పాత్రల్లో నటించే సీనియర్ నటి ప్రీతినిగమ్.. ఒక రోజు రెమ్యునరేషన్ రూ.10 వేలు.
నా పేరు మీనాక్షి సీరియల్ తో పరిచయం అయిన నవ్యస్వామి..ప్రస్తుతం ఆమెకథ సీరియల్లో నటిస్తుంది. నవ్య ఒక రోజుకి అందుకునే రెమ్యునరేషన్ రూ. 20 వేలు.
సినిమా హీరోయిన్ నుంచి టీవీ ఆర్టిస్ట్ గా మారిన సుహాసిని ‘ఇద్దరమ్మాయిలు’ సీరియల్ లో నటిస్తున్న సమయంలో కో యాక్టర్ ధర్మనే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు సుహాసిని బుల్లితెరపై టాప్ ఆర్టిస్ట్ గ అదూసుకుపోతుంది. ఆమె ఒక్కో ఎపిసోడ్ కు తీసుకునే రెమ్యునరేషన్ రూ. 25 వేలు.
అగ్నిసాక్షి సీరియల్లో మెయిన్ రోల్ పోషిస్తున్న ఐశ్వర్య ఒక రోజు రెమ్యునరేషన్ 25,000 రూ.. ఐశ్వర్య, నవ్యస్వామి ఇద్దరూ వదిన మరదళ్లు. నవ్య అన్నయ్య హరివినయ్ నే ఐశ్వర్య పెళ్లి చేసుకుంది.
కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ప్రేమి విశ్వనాధ్ అలియాస్ వంటలక్క. స్టార్ హీరో సినిమాలను టెలికాస్ట్ చేసినా.. రాని రేటింగ్ ‘కార్తీక దీపం’ సీరియల్ కు ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకు కారణం ప్రేమి విశ్వనాథ్ నటన. వంటలక్క నటనకు ఫిదా కానివారు ఉండరంటే ఉండరు. మరి ఈమె రెమ్యునరేషన్ కూడా క్రేజ్ కు తగ్గట్టే ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ కు రూ. 30 వేల రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్ పెయిడ్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది వంటలక్క.