logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందుగానే తనకంటూ ఓ ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసుకున్న బైడెన్ అందులో తెలుగువారికి ప్రత్యేక స్థానం కల్పించారు. ఇప్పటికే ఆయన టీమ్ లో 20 మంది భారతీయ అమెరికన్లు ఉండగా అందులో 13 మంది మహిళలే కావడం విశేషం. ప్రమాణ స్వీకారం సందర్భంగా అధ్యక్షుడి హోదాలో బైడెన్ చేసిన ప్రసంగంపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. ‘నేను అమెరికన్లందరికీ అధ్యక్షుడిని’ అంటూ బైడెన్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. అయితే ఈ ప్రసంగం వెనక ఉన్నది మన తెలుగు వ్యక్తే కావడం విశేషం. అతను ఎవరో కాదు కరీం నగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన చొల్లేటి వినయ్ రెడ్డి. అమెరికా అధ్యక్షుడి ప్రసంగం రాసిన తొలి భారతీయ వ్యక్తిగా చరిత్రకెక్కారు.

చొల్లేటి వినయ్ రెడ్డిని బైడెన్ తన స్పీచ్ రైటర్ గా ఎంపిక చేసుకున్నారు. దీనిపై పోతిరెడ్డిపేట గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘అమెరికా యునైటెడ్’ థీమ్‌తో ఆయన ఈ ప్రసంగాన్ని రాశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జో పేర్కొన్న పలు అంశాలను ఇందులో మేళవించారు. వినయ్ రెడ్డి తాత తిరుపతి రెడ్డి ఈ గ్రామానికి 30 ఏళ్ల పాటు సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన కుమారుడు నారాయణ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబిబిఎస్ పూర్తి చేసి పీజీ చేసేందుకు అమెరికా వెళ్లారు. 40 ఏళ్లుగా అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డారు. నారాయణ రెడ్డి ముగ్గురు కుమారుల్లో ఒకరు వినయ్ రెడ్డి.

అమెరికాలోని ఒహియో రాష్ట్రం డేటన్‌లో పుట్టి పుట్టిపెరిగారు. కిండర్ గార్డెన్ నుంచి డిగ్రీ వరకు ఒహియాలోనే చదువుకున్నారు. మియామి యూనివర్శిటీ నుంచి న్యాయ విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండ్ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ కు స్పీచ్ రైటర్ గా ఎంపికయ్యారు. 2012 అమెరికా ఎన్నికల్లో ఒబామా , బైడెన్ లకు కూడా స్పీచ్ రైటర్ గా పనిచేశారు. ఇంగ్లీషు భాషపై ఆయనకు మంచి పట్టు ఉండటంతో అధ్యక్షుడి ప్రసంగాన్ని రాసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బైడెన్ తో పాటుగా కమలా హరీష్ లకు సీనియర్ సలహాదారుడిగా, స్పీచ్ రైటర్ గా, ట్రాన్స్ లెటర్ గా వ్యవహరించారు.

బైడెన్ , కమలా హ్యారిస్ లు ఏ రాష్ట్రంలో ప్రసంగించినా వారి ప్రసంగాల్లో తెలుగోడి సత్తా కనిపించేది. ముఖ్యంగా కమలా హ్యారిస్ కూడా వృత్తి రీత్యా లాయర్ కావడంతో ఆమె వినయ్ రెడ్డి రాసిన ప్రసంగాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తించారు. ఆయన ప్రతిభకు ఫలితంగా ఇప్పుడు వైట్ హౌస్ డైరెక్టర్ గా వినయ్ రెడ్డిని నియమితులయ్యారు. ఈ ఘనత పై వినయ్ రెడ్డి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక భారతీయుడు అందులోనూ తెలంగాణకు చెందిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడి ప్రసంగాలు రాయడం గర్వకారణంగా ఉందని అంటున్నారు. అతని వల్ల తెలంగాణలోని మారుమూల ప్రాంతమైన తమ గ్రామం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News