అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన అమెరికాలోని టెక్సాస్ నగరంలో చోటుచేసుకుంది. ఓ శుభకార్యానికి బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న సమయంలో వారు పయనిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో భార్య భర్తలతో పాటుగా వారి కుమారుడు కూడా మృతి చెందాడు. ప్రమాదంలోప్రాణాలతో బయటపడిన కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. నారాయపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంటకు చెందిన నరసింహ రెడ్డి ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఆయనకు భార్య ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. నరసిమహారెడ్డి పిల్లలు ఇద్దరు టెక్సాస్ లోనే స్థిరపడ్డారు. ఇటీవల నాలుగు నెలల క్రితం భార్య భర్తలిద్దరూ పిల్లల దగ్గరకు వెళ్లారు. ఇంతలోనే కారు ప్రమాదంలో మృతి చెందారు. నరసింహారెడ్డి వచ్చే నెల పదవీ విరమణ పొందనున్నారు. ఈ కుటుంబం మరణ వార్త విని సొంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.