జర్మన్ ఔషధ సంస్థ, అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఫైజర్ టీకా బ్రిటన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. గురువారం నుండి దశల వారీగా ఈ టీకాను పంపిణీ చేస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే ఇప్పటికే కొందరు వాక్సిన్ వేసుకున్నారు కూడా. అందులో ప్రముఖ తెలుగు వైద్యుడు వెలగపూడి బాపూజీ రావు కూడా ఉన్నారు.
అయితే వాక్సిన్ తీసుకున్న అనంతరం ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వాక్సిన్ ఇచ్చిన తర్వాత 15 నిమిషాల వరకు అక్కడే కూర్చోమని చెప్తారు. వాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిపే ఒక కర పత్రాన్ని ఇస్తారు. వ్యాక్సినేషన్ తర్వాత 24 గంటల్లో ఒక్కోసారి జ్వరం, తలనోపి, ఇతర ఇబ్బందులు ఏవైనా ఉంటె గుర్తించేందుకని అన్నారు.
అలాంటి సమయాల్లో పారాసైట్ మల్ తీసుకంటే చాలని అన్నారు. క్లినికల్ ట్రయల్స్ లో ఫైజర్ వాక్సిన్ కు సంబంధించి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ తెలెత్తలేదు. అయితే వాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కరోనా లక్షణాలు తలెత్తవచ్చన్నారు. అంటే వారికి కోవిడ్ ఉన్నట్టు అర్థం కాదు కానీ కోవిడ్ లక్షణాలు కొంత వరకు కనిపించవచ్చన్నారు.
ఇది సాధారణంగా ఫ్లూ కి ఇచ్చే వ్యాక్సినేషన్ లాగే ఉన్నట్టుగా అయన తన అనుభవాలను పంచుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైనా ఎలర్జీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, గర్బిని స్త్రీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికీ ఈ వాక్సిన్ ఇవ్వడం లేదన్నారు.