logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

థియేట‌ర్ల‌లో మందు స‌ర‌ఫ‌రా చేస్తే..? తెలుగు ద‌ర్శ‌కుడి ఐడియా

క‌రోనా, లాక్‌డౌన్ దెబ్బ‌తో సినిమా ఇండ‌స్ట్రీ కష్టాల్లో కూరుకుపోయింది. మ‌రోవైపు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లు సినిమా థియేట‌ర్ల‌కు మ‌రిన్ని క‌ష్టాలు తెస్తున్నాయి. ఏదైనా సినిమా థియేట‌ర్‌లో రిలీజైన నెల రోజుల‌కే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో వ‌స్తుండ‌టంతో ఆన్‌లైన్‌లో చూడొచ్చులే అనే భావ‌న‌తో థియేట‌ర్ల‌కు వెళుతున్న వారి సంఖ్య రోజురోజుకూ త‌గ్గిపోతోంది. ఇక‌, లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్లు మూత‌బ‌డ‌టంతో కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌కుండానే నేరుగా ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తున్నారు.

ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో థియేట‌ర్ల‌ను కాపాడుకునేందుకు మ‌హాన‌టి సినిమా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌కు ఓ ఐడియా త‌ట్టింది. విదేశాలలో లాగా మ‌న వ‌ద్ద కూడా థియేట‌ర్ల‌లో బీర్, బీజ‌ర్‌, వైన్ స‌ర‌ఫ‌రా చేస్తే థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య పెరుగుతుంది అని చెబుతున్నాడు. థియేట‌ర్లను కాపాడుకునేందుకు ఇది ఒక దారి అని ఆయ‌న అంటున్నాడు. ఈ విష‌యం ఇంత‌కుముందు సురేష్ బాబు, రానా వ‌ద్ద కూడా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు చెబుతున్నాడు.

అయితే, థియేట‌ర్ల‌లో మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేయ‌డం ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్ దూరం అవుతార‌ని చెప్పిన నాగ్ అశ్విన్‌, కొన్ని థియేట‌ర్లు, మ‌ల్టిప్లెక్స్‌ల‌లో మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేయ‌వ‌చ్చ‌ని చెప్పాడు. ఈ మేర‌కు త‌న ఐడీయా ఎలా ఉంది అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన ఓ నెటిజ‌న్ థియేట‌ర్ల‌లో మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తే మార్నింగ్ షోకి వ‌చ్చిన వాడు నైట్ వ‌ర‌కు వెళ్ల‌డు అని కామెంట్ చేశాడు. కూల్‌డ్రింక్ ధ‌ర‌నే ఇప్పుడు 200 ఉంద‌ని, ఇక మ‌ద్యం ధ‌ర ఎంత ఉంటుందో ఊహించ‌గ‌ల‌మ‌ని మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశాడు.

Related News