logo

  BREAKING NEWS

క‌రోనాను ఎదుర్కొనే విట‌మిన్-డి ఇలా పెంచుకోవాలి  |   పొర‌పాటున ఈ ప‌ని చేస్తే మీ వాట్సాప్ ప‌ని ఖ‌త‌మే  |   కెలికి క‌య్యం పెట్టుకుంటున్నారు.. జ‌గ‌న్ స‌ర్కార్‌‌పై కేసీఆర్ ఫైర్‌  |   బిగ్ బ్రేకింగ్: బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో వెలువ‌డిన‌ తీర్పు‌  |   తెలుగువారిలో అత్యంత ధ‌నికులు వీరే.. క‌ళ్లు చెదిరే ఆస్తులు  |   కూర‌గాయ‌లు అమ్ముతున్న చిన్నారి పెళ్లికూతురు సీరియ‌ల్ డైరెక్ట‌ర్‌  |   హైబీపీ త‌గ్గించుకునేందుకు ఈ ఒక్క ప‌ని చేస్తే చాలు  |   బ్రేకింగ్‌: దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుద‌ల‌  |   టీడీపీ యువ నాయ‌కురాలితో యాంక‌ర్ ప్ర‌దీప్ పెళ్లి ?  |   దేవుడు వ‌ర‌మిచ్చినా.. కాలం క‌రుణించేలా లేదు  |  

బిగ్ బాస్ 4 లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న కంటెస్టెంట్లు వీరే

ఎన్ని వివాదాలు ఎదురైనా బిగ్ బాస్ రియాలిటీ షో కి ప్రేక్షకాదరణ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కానీ 15 వారాల పాటు సాగే ఈ షోలో కంటెస్టెంట్ల ఎంపికపై మాత్రం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఒక్క సీజన్ -1 మినహాయిస్తే ఆ తరువాతి అన్నీ సీజన్లలో కూడా అంతగా గుర్తింపు లేని వారిని హౌస్ లోకి పంపారనే టాక్ వినిపించింది. అయినా ఈ షో ద్వారా వారంతా సెలబ్రిటీలుగా మారిపోయారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా సెలబ్రిటీ గుర్తింపు ఉన్న వారి కన్నా సోషల్ మీడియా ద్వారా ఫెమస్ అయిన వారు, చిన్న నటీ నటుల వైపే బిగ్ బాస్ మొగ్గు చూపింది.

అయితే ఈ షోలో ఇప్పటికే 17 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. కోవిడ్ పరిస్థితుల కారణంగా కంటెస్టెంట్స్ ను షో ప్రారంభం కావడానికి 2 వరాల ముందుగానే ముందుగానే క్వారెంటైన్ లోకి పంపారు. అయితే వీరికి బిగ్ బాస్ యాజమాన్యం ఎంత రెమ్యునరేషన్ చెల్లిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికర విషయంగా మారింది. ఇకపోతే ఇప్పటివరకు జరిగిన తెలుగు బిగ్ బాస్ సీజన్లలో ముగ్గురు కంటెస్టెంట్లు మాత్రమే భారీ పారితోషికం అందుకున్నారు. టైటిల్ విన్నర్లుగా నిలిచిన వారు కాకుండా సీజన్ 1‌లో పాల్గొన్న నటుడు సమీర్ వారానికి 10 లక్షలు అందుకోగా.. సీజన్ 3లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి వారంలోనే ఎగ్జిట్ అయిన నటి హేమ వారానికి 9.7 లక్షలు అందుకున్నట్లు సమాచారం.

వీరితో పాటు యాంకర్ శ్రీముఖి 100 రోజులకు 3 కోట్లు పారితోషికం పుచ్చుకుందని తెలుస్తోంది. అటు వరుణ్ సందేశ్ కూడా కోటి బిగ్ బాస్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. తాజా సీజన్ లో కూడా అత్యధిక పారితోషకం అందుకుంటున్నవారిలో యాంకర్ లాస్య, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాత్రమే ఉన్నారు. వీరిద్దరికి రోజుకి లక్ష రూపాయలు చెలిస్తున్నారట. 100 రోజుల పాటు హౌస్ లో ఉండగలిగితే వీరికి దాదాపు కోటి రూపాయల వరకు ముట్టజెపుతారు. ఇక టైటిల్ విన్నర్ అయితే గనుక అదనంగా మరో 50 లక్షల ప్రైజ్ మనీ అందుకుంటారు. మిగిలిన కంటెస్టెంట్లలో రోజుకి 50 వేల నుంచి 10 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకునే వారు కూడా ఉన్నారు.

గత వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ దర్శకుడు సూర్యకిరణ్ కు రోజుకి 50 వేలు చెల్లించవలసి ఉండగా తాను ఊహించిన దాని కంటే 10 రేట్లు అధికంగా చెల్లించారని సంతోషం వ్యక్తం చేసాడు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో హీరోయిన్ మోనాల్ గజ్జర్ 50 వేలు, హీరో అభిజిత్ 20 వేలు, జోర్దార్ యాంకర్ సుజాత 10 వేలు, మెహబూబ్ దిల్‌సే 10 వేలు, టీవీ 9 యాంకర్ దేవి 25 వేలు, టీవీ యాక్టర్ సయ్యద్ సోహైల్ 10 వేలు, యాంకర్ అరియానా గ్లోరీ 10 వేలు, కరాటే కళ్యాణి 25 వేలు, సింగర్ నోయల్ 50 వేలు, హీరోయిన్ దివి 25 వేలు, అఖిల్ సార్థక్ 10 వేలు, గంగవ్వ 25 వేలు, వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘ఈరోజుల్లో’ ఫెమ్ కుమార్ సాయి రోజులు 10 వేలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక పోతే బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున రికార్డు స్థాయిలో రూ. 8 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

 

Related News