logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

షాకింగ్: బిగ్ బాస్ సీజన్ – 4 కంటెస్టెంట్ కు కరోనా..?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సినీ, టీవీ నటులను కూడా ఇబ్బందుల పాలు చేస్తుంది. ఇప్పటికే పలువురు నటీనటులు ఈ వైరస్ భారిన పడ్డారు. కరోనాను లెక్క చేయని స్టార్ మా యాజమాన్యం మాత్రం ఈసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 4 ను నిర్వహించి తీరుతామని తెలిపింది. ఈ షోకి టాలీవుడ్ మన్మథుడు, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

సీజన్ 4 లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్ల ను కోవిడ్ నిబంధనల మేరకు ముందుగా 14 రోజుల పాటు క్వారెంటైన్ లో ఉంచనున్నారు. ఈ క్వారెంటైన్ ను పూర్తి చేసిన వారినే కంటెస్టెంట్లుగా హౌస్ లోకి పంపించనున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొననున్న 16 మంది కాంటెష్టాంట్లను క్వారెంటైన్ కు తరలించారు. కాగా వీరిలో ఒక సింగర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో స్టార్ మా యాజమాన్యం ఖంగుతిన్నది. మిగిలిన వారికి కూడా మరొక్కసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారనే సమాచారం.

ప్రస్తుతం ఈ షోలో కంటెస్టెంట్లుగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో యంగ్ హీరో నందు తాను బోగ్ బాస్ లో పాల్గొననున్నాననే విషయాన్నీ కంఫర్మ్ చేసాడు. ఇక మిగిలిన వారిలో.. కృష్ణ వేణి సీరియల్ నటుడు, యూట్యూబ్ స్టార్ గంగవ్వ, అలేఖ్య హారిక, మహాతల్లి జాన్వీ, ఆమె భర్త, సింగర్ ప్రణవి, ఆమె భర్త. మెహబూబ్ దిల్ సే, యాంకర్లు అరియనా గ్లోరీ, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Related News