logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ రెడీ.. క్వారెంటైన్ కు వెళ్లే 18 మంది కంటెస్టెంట్లు వీరే..!

కరోనా కారణంగా అన్ని రకాల షూటింగులు నిలిచిపోయాయి. పలువురు సినీ టీవీ ఆర్టిస్టులు కరోనా భారిన పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి బిగ్ బాస్ రియాలిటి షో ఉంటుందా ఉండదా అనే అనుమానాలకు చెక్ పెడుతూ బిగ్ బాస్ సీజన్ 4 ను స్టార్ మా ఛానెల్ అనౌన్స్ చేసింది. ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. కరోనా భయంతో స్టార్ హీరోల సినిమా షూటింగులు కూడా అర్థాంతరంగా నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో నాగార్జున ఈ షో కోసం షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా ఓ ప్రోమో విడుదల చేసి షాకిచ్చారు. అయితే బిగ్ బాస్ యాజమాన్యానికి ఈసారి షోను నిర్వహించడం అంత తేలికైన విషయం కాదు. షో కారణంగా ఏ ఒక్క టెక్నీషియన్ ఈ మహమ్మారి భారిన పడినా అది బిగ్ బాస్ కు నెగిటివ్ పబ్లిసిటీ తీసుకువచ్చే ప్రమాదం ఉంది. దీంతో ఈ రియాలిటీ షోలో పాల్గొనే కంటెస్టెంట్లను క్వారెంటైన్ కు పంపించనుంది.

నిజానికి ఈ ఎపిసోడ్ ఆగస్టు 30న ప్రారంభం కావలసి ఉంది. కానీ కోవిడ్ నిబంధనల మేరకు రెండు వారాల ముందుగానే వీరందరిని క్వారెంటైన్ లో ఉంచి ఆ తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తకపోతే వారిని హౌస్ లోకి పంపించనున్నారు. దీంతో షో మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 15 వారాల పాటు సాగే ఈ షోలో మొత్తం 18 మంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. అందులో ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళతారు. షోలో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలను బిగ్ బాస్ గోప్యంగా ఉంచుతుందని విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు వీరంతా క్వారెంటైన్ కు వెళ్ళవలసి రావడంతో ఎవరెవరు బిగ్ బాస్ కు వెళతారో అభిమానులు ముందుగానే పసిగడుతున్నారు. కంటెస్టెంట్ల లిస్టులో ముందునుంచి బాగా వినిపిస్తున్న పేర్లలో సింగర్ గీతా మాధురి భర్త, హీరో నందు, యూట్యూబ్ స్టార్ మహాతల్లి జాన్వీ, ఆమె భర్త సుశాంత్, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్- ప్రణతి, జబర్దస్త్ అవినాష్, షార్ట్ ఫిలిం నటుడు మెహబూబ్ దిల్ సే ఉన్నారు. వీరితో పాటుగా గత సీజన్ లో సందడి చేసిన యాంకర్ శివజ్యోతి స్థానంలో జోర్దార్ వార్తలు చదివే సుజాత హౌస్ లోకి వెళ్లనుంది.

మరో ఇద్దరు యాంకర్లు.. జెమిని ప్రశాంతి, ఆరియానా గ్లోరీ ఉన్నారు. సీజన్ 3లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ కాగా ఇప్పుడు అతని స్థానంలో అతని స్నేహితుడు సింగర్ నోయల్ పేరు కూడా ఈ లిస్టులో గట్టిగానే వినిపిస్తుంది. ఇక టీవీ నటుల్లో కృష్ణవేణి సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సయ్యద్ సోహైల్, కరాటే కళ్యాణి, క్యారెక్టర్ ఆర్టిస్టు అపూర్వ ఉన్నారు. ఈసారి టాలీవుడ్ వర్ధమాన హీరోయిన్లను కూడా బిగ్ బాస్ సంప్రదించినట్టు తెలుస్తుంది. వీరిలో హుషారు ఫెమ్ ప్రియా వడ్లమాని, యామిని భాస్కర్, మరో హీరోయిన్ పూనమ్ బజ్వా కూడా ఉన్నట్టు సమాచారం.

Related News