logo

  BREAKING NEWS

బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |   నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |   ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!  |   ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |  

బాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ రేంజ్‌కి ఎదిగిన వీరంతా మ‌న‌వాళ్లే

పరబాషా నటులకే తెలుగు పరిశ్రమలో అవకాశాలు ఉంటాయని, ఇక్కడివారిని పట్టించుకోరని కొందరు నటులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఒక దశలో తమిళ డబ్బింగ్ సినిమాలు స్ట్రెయిట్ సినిమాలతో సమానంగా ఇక్కడ విడుదలయ్యాయి. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలకు ఇక్కడ కూడా అభిమాన గణం ఎక్కువే. విక్రమ్, సూర్య, కార్తీ వంటి వాళ్లకు కూడా తెలుగులో స్టార్ ఇమేజ్ లభించింది. తమిళ, హిందీ సినిమాలలోనూ మన తెలుగు నటుల డామినేషన్ భారీగానే ఉంది. తమిళ సినీ పరిశ్రమను ఏలుతున్న స్టార్లలో తెలుగువారే ఎక్కువ మంది. మ‌నోళ్లు తమిళంలో స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్నారు.

విశాల్.. విశాల్ కృష్ణారెడ్డి:
ప్రస్తుతం తమిళ నటీనటుల సంఘానికి విశాల్ నాయ‌కుడు. అంత స్థాయికి ఎదిగాడితను. విశాల్ పూర్తి పేరును బట్టే ఇతడు తెలుగు వాడని అర్థం అవుతుంది. తెలుగులో ‘‘ఎం ధర్మరాజు ఎమ్‌ఏ’’ వంటి సినిమాను రూపొందించిన నిర్మాత జీకే రెడ్డి తనయుడు విశాల్. చాలా సంవత్సరాల క్రితమే చెన్నైలో సెటిలయ్యింది నెల్లూరుకు చెందిన జీకే రెడ్డి కుటుంబం. మొదటగా అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా తమిళంలో కెరీర్ మొదలు పెట్టి తర్వాత నటుడిగా టర్న్ అయ్యాడు. ‘‘ప్రేమచదరంగం’’తో మొదలు విశాల్ క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు సొంతంగా నిర్మాతగా.. తమిళంలో స్టార్‌ హీరోగా కొనసాగుతున్నాడు. విశాల్ వాళ్ల అన్న విక్రమ్ కృష్ణారెడ్డి నిర్మాతగా పేరున్న వ్యక్తి.

అజిత్ కుమార్:
కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ అటు తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటున్నాడు. ఇతను పుట్టింది మన సికింద్రాబాదులోనే. అతని నట జీవితం కూడా తెలుగు సినిమాతోనే మొదలైంది. ప్రేమ పుస్తకం అనే తెలుగు సినిమాలో అజిత్ తొలిసారిగా నటించాడు. తమిళనాడుకు వెళ్లిన మొదట్లో అజిత్ కు తమిళ బాష సరిగా వచ్చేది కాదట. కానీ ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం తో పాటుగా ఇంగ్లీషు భాషపై కూడా ఆయనకు విపరీతమైన పట్టు ఉంది. పట్టుదలతో బాష నేర్చుకోవడమే గాక తమిళ మెగాస్టార్ గా ఎదిగాడు అజిత్.

జయం రవి:
తెలుగులో సూపర్ హిట్ అయిన ‘జయం’ సినిమాను తమిళ రీమేక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొన్నాడు ఈ హీరో. జయం రవి మూలాలు కూడా తెలుగువే. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన ఎడిటర్ మోహన్ తనయుడే జయం రవి. ప్రస్తుతం తమిళంలో హీరోగా చెలామణి అవుతున్నాడు. ఇతడి సోదరుడు రాజా తెలుగులో కూడా ఒకటీ రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

జీవా:
తమిళంలో ఫ్లెక్సిబుల్ ఆర్టిస్టుగా పేరుంది జీవాకి. తెలుగులో కూడా ‘‘రంగం’’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకొన్నాడు ఈ హీరో. బాలీవుడ్ సినిమా ‘త్రీ ఇడియట్స్’ రీమేక్‌గా తమిళంలో వచ్చిన ‘నన్బన్’ సినిమాలో ఒక పాత్ర చేయడం ద్వారా జీవా తనెంత ప్రత్యేకమో నిరూపించుకొన్నాడు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన ఆర్.బి.చౌదరి తనయుడు జీవా. తమిళంలో కూడా ఈ నిర్మాతకు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఆ నేపథ్యంతోనే తనయుడిని హీరోగా చేశాడు చౌదరి. ఇప్పుడు జీవా తమిళంలో ఆర్టిస్టుగా దూసుకుపోతున్నాడు. చౌదరి రెండో తనయుడు జీతన్ రమేష్ కూడా నటుడిగా ఇండస్ట్రీలో ఉన్నాడు.

ఆది పిన్నిశెట్టి:
రవి రాజా పిన్నిశెట్టి తనయుడు అది. తెలుగులో ‘మృగం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకొన్న ఆది అప్పటికే తమిళంలో గుర్తింపు ఉన్న నటుడు. సూపర్ స్టార్ కాదు కానీ.. ఇతడి ప్రతిభ మీద ఆధారపడి కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు వచ్చాయి తమిళంలో. రవిరాజ పిన్నిశెట్టి కెరీర్ హిట్స్ అన్నీ రీమేక్ సినిమాలే. ప్రత్యేకించి తమిళంలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి పేరు తెచ్చుకొన్నాడు ఈ దర్శకుడు. ఈయన తనయుడు కూడా తమిళంలోనే పేరు తెచ్చుకోవడం విశేషం.

జానీ లీవర్:
బాలివుడ్లో టాప్ మోస్ట్ కమెడియన్లలో ఒకరు. జానీలివర్ అసలు పేరు జాన్ ప్రకాశ్‌రావు జనుమల.. స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కనిగిరి. జానీ లివర్ తండ్రి ప్రకాశ్ రావు హిందుస్తాన్ లివర్ లో ఆపరేటర్ గా చిన్న ఉద్యోగం చేసేవాడు. ముంబైలో ఉద్యోగం కావడంతో కుటుంబం అంతా అక్కడే స్థిరపడింది. జానీ లివర్ పుట్టి పెరిగింది ముంబయిలోనే. కానీ వీరి చుట్టాలంతా ప్రకాశం జిల్లాలోని కనిగిరి, దర్శి, సంత నూతలపాడులోనే ఉన్నారు.

అదితిరావు హైదరీ:
అదితిరావు తల్లిదండ్రులు ఇద్దరూ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆమె తండ్రి అస్సాంకు చెందిన మహ్మద్ సలెహ్ అక్బర్ హైదరీ రాజ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె. అస్సాం మాజీ గవర్నర్ మహ్మద్ సాలెహ్ అక్బర్ హైదరి మనవరాలు. సినీ నిర్మాత, ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు, అదితి కజిన్ అవుతుంది. వనపర్తి సంస్థాన మహారాజు రాజా రామేశ్వరరావు, శాంతా రామేశ్వరరావులు అదితికి తాతయ్య, అమ్మమ్మలు అవుతారు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఉన్న రిషీ వ్యాలీ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. మణిరత్నం ‘చెలియా’ సినిమాతో సినీ పరిశ్రమను ఆకర్షించింది.

దియా మీర్జా:
బాలీవుడ్ నటి దియా మిర్జా హైదరాబాద్‌లో జన్మించింది. ఖైరతాబాద్ లో చదువుకుంది. ఓ మీడియా సంస్థకు పని చేస్తుండగా ఆమెకు సినిమా అవకాశాలు రావడంతో బాలీవుడ్ కు వెళ్లింది. 2000 సంవత్సరంలో మిస్ ఇండియా టైటిల్ కూడా గెలుచుకుంది. బాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి. దియా మీర్జా నటి మాత్రమే కాదు. ఆమె పర్యావరణ ప్రేమికురాలు కూడా. ఐక్య రాజ్య సమితీ దియా మీర్జాను సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్ అడ్వకేట్ గుడ్విల్ అంబాసిడర్ గా నియమించింది.

వైభవ్ రెడ్డి:
తెలుగు వెటరన్ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్. మొదటగా హీరోగా తెలుగులోనే ట్రయల్ వేసినా అది హిట్ కాలేదు. ఆ తర్వాత ఒకటీ రెండు ప్రయత్నాలు చేసినా ఈ కుర్రాడి టాలీవుడ్ లో కాలం కలిసి రాలేదు. ఆ తర్వాత చెన్నైలో తన స్నేహాలతో తమిళంలో అవకాశాలను సంపాదించుకొన్నాడు వైభవ్. దర్శకుడు వెంకట్ ప్రభు సినిమాల్లో అయితే వైభవ్‌కు మంచి పాత్రలు లభిస్తుంటాయి. ఒకవేళ మంచి పాత్ర లభించకపోయినా.. వైభవ్‌కు గెస్ట్ రోల్ లోనైనా చూపిస్తుంటాడు వెంకట్ ప్రభు. ఈ విధంగా ఇప్పుడు వైభవ్ కోలీవుడ్‌లో ఒక గుర్తింపు ఉన్న ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.

Related News