logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

పదో తరగత పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో జూన్ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా కేసు పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిలిపివేయాలంటూ హై కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

పరీక్షల నేపథ్యంలో ప్రైవేటు స్కూల్స్ హాస్టళ్లను తాత్కాలికంగా తెరిచేందుకు అనుమతిస్తామని తెలంగాణ విద్య శాఖ కోర్టును తెలిపింది. ఈసారి పరీక్షలు రాయలేని విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలలో అవకాశం కల్పిస్తామని కోర్టుకు తెలిపింది. మరి సప్లిమెంటరీ విద్యార్థులను కూడా రెగ్యులర్ విద్యార్ధులలాగానే పరిగణిస్తారా అంటూ కోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో కంటోన్మెంట్ జోన్లలో ఉన్న విద్యార్థులు పరిస్థితి ఏమిటని కూడా ప్రశ్నించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుసుకుని కోర్టుకు తెలుపుతామని ఏజీ తెలిపారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల పై విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు.

Related News