logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

చైనా సరిహద్దు కాల్పుల్లో తెలంగాణ కల్నల్ మృతి

భారత్ చైనా సరిహద్దు లో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసందే. లఢక్ లోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ వివాదంలో నెలకొన్న దాడులలో ఆర్మీ కల్నల్ తో పాటుగా ఇద్దరు సైనికులు మృతి చెందిన సంగతి తెలిసందే. మృతుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు అమరుడయ్యాడు.

గత ఏడాదిన్నరగా సంతోష్ బాబు సరిహద్దుల్లో పని చేస్తున్నారు. కాగా ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెల రోజుల క్రితమే ఆయన తన ఉపాధ్యాయులను కలిసి వెళ్లారని చెబుతున్నారు. సోమవారం రాత్రి చైనా సరిదిద్దుల్లో జరిగిన కాల్పుల్లో కల్నల్ మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్ బాబు మృతితో సూర్యాపేట లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చైనా బలగాలు భారత భూభగంలోకి ప్రవేశించడం వల్లనే వాగ్వాదం నెలకొందని భారత భూభాగం నుంచి వైదొలగాలని హెచ్చరించిన కారణంగానే చైనా దళాలు భారత సైనికులపై దాడి చేసారని సమాచారం. కానీ చైనా మాత్రం తమ భూభగంలోకే భారత సైనికులు వచ్చారని, ఈ దాడుల్లో చైనా తమ ఐదుగురు సైనికులు కూడా పోగొట్టుకుంది చెబుతుంది.

లఢక్ లోని గాల్వన్ లోయ వద్ద భారత్ కు చెందిన బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డర్బుక్‌-ష్యంకు- దౌలత్‌బేగ్‌ ఓల్డీకి 255 కిలో మీటర్ల రహదారిని నిర్మిస్తున్నారు. కాగా చైనా దీనిపై అభ్యంతరం చెబుతుంది. ఈ ప్రాంతమంతా తమదే అంటూ భారత్ భూభాగంలోకి వచ్చి చైనా దళాలు శిబిరాలను ఏర్పాటు చేసుకున్నాయి. గత నెల రోజులుగా సరిహద్దుల్లో ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయి. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతుండగానే ఇలాంటి హింసాత్మక ఘటనలు నెలకొనడం ఆందోళన కలిగిస్తుంది.

Related News