logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్ లో ఆ రెండు జిల్లాలు!

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేశారు. కాగా ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేసారు. మొత్తం 9,65,839 విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా ఇంటర్ మొదటి సంవత్సరంలో 2.88 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

మొత్తం విద్యార్థులు ఉత్తీర్ణత 60.10 శాతంగా నమోదైంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలికలదే పైచేయి. బాలికలు 67. 4 శాతం ఉత్తుర్ణత సాధించగా .. బాలురు 52. 30 శాతం పాసయ్యారు. ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాల విషయానికొస్తే.. 2. 83 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరంలోనూ బాలికలదే పై చేయి అని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

కాగా ఇంటర్ మొదటి సంవత్సరంలో 71. 15 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ మొదటి స్థానం లో నిలవగా.. ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమరం భీం జిల్లా తొలి స్థానంలో నిలిచిందని సబితా ఇంద్రధరెడ్డి వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షల వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు.

Related News