logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

తెలంగాణ హోమ్ మంత్రికి కరోనా పాజిటివ్..!

తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్ అలీ కరోనా బారిన పడ్డారు. ఆస్తమా తో బాధపడుతున్న ఆయన జలుబు వంటి కరోనా లక్షణాలు ఉండటంతో మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో నిన్న రాత్రి జూబ్లీహిల్స్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తుంది. ఆస్తమా ఉన్న కారణంగా ముందు జాగ్రత చర్యగా ఆయనను ఆసుపత్రికి తరలించామని, అయన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కాగా ఇప్పుడు ఆయనతో సన్నిహితంగా మెలిగిన నేతల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కొందరు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా భారిన పడ్డారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. నేతల వద్ద పని చేస్తున్న సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తెలుస్తుంది. .

Related News