రాష్ట్రంలో కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర హై కోర్టు ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. నీలోఫర్ ఆసుపత్రిలో భోజనాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ అక్రమాలపై హై కోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై హై కోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానిస్తూ విచారణ కమిటీ నివేదిక ఇచ్చి ఐదు నెలలు కావొస్తున్నా తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది.
నీలోఫర్ ఆసుపత్రిలో భోజనాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ సురేష్ పైన ప్రభుత్వం ఎందుకింత ప్రేమ చుసుపుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. చూడబోతే కాంట్రాక్టర్ సురేష్ ను అందరూ వెనకేసుకొస్తున్నట్టుగా కనిపిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. గాంధీ, ఛాతీ ఆస్పత్రుల్లో కూడా కాంట్రాక్టర్ సురేష్కుమార్ పనితీరును పరిశీలించి, ఆగష్టు 17లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.