logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

పదో తరగతి పరీక్షలపై వీడిన ఉత్కంఠ.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు సీరియస్!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలను జూన్ 8వ తేదీ నుండి నిర్వహించడానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగిలిన జిల్లాల్లో మాత్రమే అనుమతి జారీ చేసింది. జిహెచ్ఎంసి పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని తెలిపింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ విద్యార్థుల లాగానే గుర్తించాలని కోర్టు ఆదేశించింది.

అయితే ఈ విషయంపై తెలంగాణ సర్కార్ జిహెచ్ఎంసి పరిధిలో కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని ఈ ప్రాంతంలో కూడా పరీక్షలు నిర్వహించడానికి అనుమతనివ్వాలని కోర్టును కోరింది. ఈ విషయంలో మాత్రం కోర్టు కొంత ఘాటుగానే స్పందించింది. కరోనా కారణంగా ఎవరైనా విద్యార్థి మరణిస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?.. మరణించిన విద్యార్థికి ఎన్ని కోట్లు ఇస్తారని సూటిగా ప్రశ్నించింది. అందుకు ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపింది. మనకు విద్యార్థులు పరీక్షల కన్నా వారి ప్రాణాలే ముఖ్యమని కోర్టు తేల్చి చెప్పింది.

పరీక్ష కేంద్రాలు కంటోన్మెంట్ జోన్లుగా మారితే ఎం చేస్తారని మరో ప్రశ్న వేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లక్షల మంది విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని తెలిపింది. నేడు ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు విద్యార్థులకు పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. అయితే ప్రశ్న పత్రాలను రెండు సార్లు తయారు చేయడం కష్టమని ప్రభుత్వం తరపు అడ్వొకేట్ కోర్టుకు తెలిపారు.

మీకు విద్యార్థులు ప్రాణాలు ముఖ్యమా లేక సాంకేతిక అంశాలు ముఖ్యమా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా జిహెచ్ఎంసీ ప్రాంతాలు మినహా అన్ని జిల్లాలో పరీక్షలు నిర్వహించవచ్చని హై కోర్టు ఇచ్చిన తీర్పుతో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. విద్యార్థులు కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు.

Related News