logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

కేసీఆర్ సర్కారుకు షాకిచ్చిన హై కోర్టు…!

రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అవకతవకలకు తావు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ధరణి పోర్టల్ లో భద్రతా పరమైన అంశాలపై దాఖలైన పిటిషనలపై నేను హై కోర్టు విచారణ జరిపింది. ధరణి పోర్టల్ లో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల వివరాలను నమోదు చేయడంపై కోర్టు స్టే విధించింది.

నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలను నమోదు చేయవద్దని హై కోర్టు ఆదేశాలు జరీ చేసింది. గూగుల్ ప్లే స్టోర్ లో ధరణిని పోలిన మరో నాలుగు యాప్ లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ప్రజలకు అసలు ధరణి పోర్టల్ ఏదో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని సందేహం వ్యక్తం చేసింది. ధరణి పోర్టల్ విషయంలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారో ముందు తెలపాలని అప్పటివరకు ఎలాంటి వివరాలను ఆమూడు చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఏ చట్టం ప్రకారం కులం, ఆధార్ కార్డు వివరాలు సేకరిస్తున్నారో తెలపాలని కోర్టు ప్రశ్నించింది.

కాగా దీనిపై మరో రెండు వారాల్లో కౌంటర్ ద్వారా పూర్తి నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశించింది. ప్రజల వద్ద సేకరించిన వివరాలను పోర్టల్ లో ఉంచడం ద్వారా భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. బలవంతంగా ఎలాంటి వివరాలను ప్రజలవద్ద నుంచి సేకరించవద్దని కోరు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20 కి వాయిదా వేసింది కోర్టు.

Related News