logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

ఆన్ లైన్ తరగతులపై హైకోర్టు సీరియస్.. కీలక వ్యాఖ్యలు!

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తుండటం, తల్లిదండ్రుల వద్ద ఫీజులు వసూలు చేస్తుండటంపై ఓ న్యాయవాది హై కోర్టును ఆశ్రయించాడు. దీనిపై నేడు విచారణ చేపట్టిన హై కోర్టు తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జులై 31 వరకు రాష్ట్రంలో పాఠశాలలు నిర్వహించరాదని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పలు జిల్లాలో ఆన్ లైన్ తరగతులు జోరుగా సాగుతుండటంపై హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

వాటికి తాము అనుమతి ఇవ్వలేదని తెలిపింది. ప్రభుత్వం వివరణపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు మరి మీ అనుమతి లేకుండానే ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్న వారిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని మరో ప్రశ్న వేసింది. ఈ అంశంపై వారం రోజులో సమగ్ర విచారణ చేపట్టి కోర్టుకు నివేదికను అందజేస్తామని ప్రభుత్వం తరపు అడ్వొకేట్ జనరల్ వివరించారు. కోర్టుకు తెలిపిన దాని ప్రకారం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతుంది.

మరోవైపు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ బోధిస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై కూడా మరో పిటిషన్ దాఖలైంది. దానిపై స్పందించిన కోర్టు స్కూళ్ల సమాఖ్య తరపున వాదనలు వివినిపిస్తున్న న్యాయవాదిపై మండిపడింది. బోర్డు ఆదేశాల ప్రకారమే తాము క్లాసులు నిర్వహిస్తున్నామని, అయితే ఇందులో వాలంటరీ విధానాన్ని కూడా తెచ్చామన్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైతేనే తరగతులకు హాజరయ్యే అవకాశం కల్పించామన్నారు.

ఈ వివరణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు అంత సమయం విద్యార్థులు కంప్యూటర్ల ముందు కూర్చుంటే వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటి? మీరు చెప్తున్న వాలంటరీ విధానం ఎక్కడుంది. ఒక విద్యార్ధి తరగతులకు హాజరైతే మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి పిల్లలపై ఒత్తిడి తెచ్చి మరీ తరగతులకు హాజరవ్వాలంటారు. ఇక వాలంటరీ విధానం ఎలా సాధ్యపడుతుంది అని కోర్టు మండిపడింది. మరో వారం రోజుల్లో దీనిపై సమగ్ర నివేదించాలని కోర్టు అద్దేశించింది.

Related News