logo

  BREAKING NEWS

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?  |   కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి  |   గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?  |   బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  |   మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి  |   మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌  |   క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |  

వారందరికీ ఇస్తారా?.. దర్శకుడు శంకర్ కు భూకేటాయింపులపై హైకోర్టు సీరియస్..!

తెలంగాణ ఉద్యమం సమయంలో సినిమా పరిశ్రమ తరపున పోరాడిన దర్శకుడు ఎన్. శంకర్ కు తెలంగాణ ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని మోకిళ్ళలో స్టూడియో నిర్మాణం కోసం ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున ఈ భూమిని కేటాయించింది. కాగా కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని రూ. 5 లక్షల రూపాయలకు ఏ విధంగా కేటాయిస్తారని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె. శంకర్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.

ఈ పిటిషన్ పై ఈరోజు హై కోర్టులో విచారణ జరిగింది. 2.5 కోట్లు విలువైన 25 లక్షలకు ఏ విధంగా కేటాయించారని కోర్టు ప్రభుత్వం తరపు ఏజీని ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమంలో శ్నాకర్ కీలక పాత్ర పోషించారని ఏజీ తెలిపారు. అలా అయితే ఉద్యమ సమయంలో వేల మంది ప్రాణాలు త్యాగం చేసారు వారందరికీ ఇస్తారా? అని కోర్టు ప్రశ్నించింది. హైద్రాబాదులో ఇప్పటికే ఎంతో అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ ఉంది.

ఒక వేళ కావాలనుకుంటే ప్రభుత్వమే స్టూడియోను నిర్మించి ఇవ్వచ్చు కదా? అని ప్రశ్నించింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వరాదని వ్యాఖ్యానించింది. అదే విధంగా ప్రభుత్వ భూములు సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలు సహేతుకంగా ఉండాలని కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Related News