logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. సిద్ధిపేట కలెక్టర్ కు జైలు శిక్ష!

తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు కలెక్టర్లు, ఓ ఆర్డీవోకు జైలు శిక్ష విధించింది. అందులో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఆర్డీవో జయచంద్రారెడ్డి ఉన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా ఉద్దేశపూర్వకంగానే ఈ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసులో ఇది వరకే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు తెలంగాణ హై కోర్టు మూడు నెలల జైలు శిక్షతో పాటుగా రూ. 2 వేల జరిమానా విధించింది. తాజాగా ఈ కేసులో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామిరెడ్డి కి మూడు నెలల జైలు శిక్ష రూ. 2 వేల రూపాయల జరిమానా విధించడంతో పాటుగా పిటిషనర్ కు రూ. 25 వేల రూపాయలను చెల్లించాలని ఆదేశించింది. ఆర్డీవో జయచంద్రారెడ్డికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రైతుల నుంచి సేకరించిన భూములకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించేంత వరకు వాటిని ముంపుకి గురి కాకుండా చూడాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతుకుంట మండలం అనంతగిరి రిజర్వాయరు కోసం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర, అప్పటి జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, భూసేకరణ అధికారి ఎన్. శ్రీనివాసరా రావు భూసేకరణ చేపట్టారు. అనంతగిరి గ్రామానికి చెందిన 11 మంది రైతుల నుంచి భూములు, ఇళ్లను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఇళ్లకు మాత్రమే నష్ట పరిహారం చెల్లించి భూములకు పరిహారం ఇవ్వలేదు.

దీంతో ఆ రైతులు గతంలో హై కోర్టును ఆశ్రయించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని హై కోర్టుకు విజ్ఞప్తి చేసారు. ఈ పిటిషన్ పై విచారించిన హై కోర్టు నష్టపరిహారం చెలించేంత వరకు ఆ భూములలోకి రిజర్వాయరు నీటిని వదలకూడదని, అవి ముంపుకు గురి కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయని అధికారులు అనంతగిరి ప్రాజెక్టు పూర్తయ్యాక నీటిని కిందకు విడుదల చేయడంతో ఆ భూములన్నీ ముంపుకు గురయ్యాయి.

దీనిపై మరోసారి ఆ రైతులు కోర్టును ఆశ్రయించారు. వాదనల సమయంలో ఆ భూములు నీట ముణగలేదని అధికారులు కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది . దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఇద్దరు కలెక్టర్లతో పాటుగా మరో అధికారికి జైలు శిక్షను విధించిందని. అలాగే పిటిషన్లు వేసిన 11 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లేందుకు అధికారులకు ఆరు వారాల గడువు నిచ్చింది కోర్టు. అప్పటి వరకు ఈ శిక్షను అమలు చేయరు. అదే సమయంలో అధికారుల సర్వీసు రికార్డుల్లో దీనిని రిమార్కుగా చేర్చాలని కోర్టు ఆదేశించింది.

Related News