logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

హైదరాబాద్ లో లాక్ డౌన్ ఉంటుందా?… ఉండదా? : హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్ నగరంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మొదటి విడత లాక్ డౌన్ లోనే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఊహించని విధంగా పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసింది ప్రభుత్వం. కాగా రాష్ట్రంలో నిర్వహించవలసి ఉన్న ప్రవేశ పరీక్షలపై ఇప్పుడు సందిగ్దత నెలకొంది.

కాగా లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుండి ప్రవేశ పరీక్షలు నిర్వహించవలసి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేపటి నుంచి జరగవలసిన ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలంటూ హై కోర్టు లో పిల్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కాగా ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ హైద్రాబాద్లో మళ్ళీ లాక్ డౌన్ విధించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టుగా వెల్లడించారు.

తాజాగా హై కోర్టు హైదరాబాద్ లో లాక్ డౌన్ పై ఆరా తీసింది. మళ్ళీ లాక్ డౌన్ విధిస్తే పరీక్షలు ఎలా నిర్వహించగలుగుతారని ప్రశ్నించింది. అసలు ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలపాలని, లాక్ డౌన్ అవకాశాలపై స్పష్టత ఇవ్వాలని హై కోర్టు ఏజీని ఆదేశించింది.

Related News