తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమోదు ప్రక్రియపై రాష్ట్ర హై కోర్టు మరోసారి కీలక చేసింది. ప్రజల నుంచి తెలివిగా సున్నితమైన సమాచారం సేకరిస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. కాగా ఎలాంటి చట్టం చేయకుండానే ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియలో భాగంగా ఆధార్ వివరాలతో పాటుగా కులం, కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నారని, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని న్యాయవాదులు కె. సాకేత్, ఐ. గోపాల్ శర్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ధరణి పోర్టల్ నుంచి ఆధార్ కాలం ను పూర్తిగా తొలగించిన తర్వాతనే స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజల నుంచి ఇతర గుర్తింపు పత్రాలు అడగవచ్చని కానీ ఆధార, కులం, కుటుంబ వివరాలు సేకరించవద్దని మరోసారి కోర్టు స్పష్టం చేసింది. అందుకు సంబందించిన సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసి తమకు సమర్పించాలని సూచించింది. ఈ విచారణను 20 వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం లేదని వ్యాఖ్యానించింది.