logo

  BREAKING NEWS

నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |   గ్రీన్ టీతో క‌రోనాకు చెక్‌  |   తెలంగాణ ప్ర‌జ‌లారా హాయిగా ఊపిరి పీల్చుకోండి.. క‌రోనా గండం గ‌ట్టెక్కిన‌ట్లే  |   క‌రోనా వ్యాక్సిన్‌కు ముందు, త‌ర్వాత మ‌ద్యం, సిగ‌రేట్ తాగొచ్చా ?  |   క‌రోనా విజేత‌లకు 10 నెల‌లు ర‌క్ష‌ణ‌  |   Good News: అతి త‌క్కువ ధ‌ర‌కు కొత్త‌ క‌రోనా వ్యాక్సిన్‌  |  

తెలంగాణ‌లో ముందుగా వారికే క‌రోనా వ్యాక్సిన్‌

క‌రోనా వైర‌స్‌ను నియంత్రించే ఆయుధం వ్యాక్సిన్ మాత్ర‌మే అని భావిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో తెలంగాణ ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తికి ఎక్కువ‌గా కార‌ణ‌మ‌య్యే సూప‌ర్ స్ప్రెడ‌ర్ల‌కు ముందుకు వ్యాక్సిన్ ఇవ్వాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. రాష్ట్రంలో సుమారు 30 ల‌క్ష‌ల మంది సూప‌ర్ స్ప్రెడ‌ర్లు ఉన్నార‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. ముందుగా వీరికి వ్యాక్సినేష‌న్ పూర్తి చేస్తే క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గిపోతుంద‌ని ప్ర‌భుత్వ వైద్యారోగ్య శాఖ భావిస్తోంది.

నిత్యం ప్ర‌జ‌ల‌తో ప‌ని చేసేవారు, లాక్‌డౌన్‌లోనూ ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీర్చే వారిని సూప‌ర్ స్ప్రెడ‌ర్లుగా భావిస్తున్నారు. వీరు క‌రోనా వైర‌స్ బారిన ప‌డేందుకు ఎక్కువ అవ‌కాశం ఉంది. వీరి ద్వారా ప్ర‌జ‌ల‌కు కూడా వైర‌స్ సోకే ఛాన్స్ ఉంది. అందుకే, వీరికి ముందుగా వ్యాక్సిన్ ఇస్తే వీరి ప్రాణాలు కాపాడ‌టంతో పాటు క‌రోనా వైర‌స్ వ్చాప్తిని కూడా త‌గ్గించ‌వ‌చ్చ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. అందుకే ముందుగా సూప‌ర్ స్ప్రెడ‌ర్ల‌కు టీకా ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఇదే స‌మ‌యంలో ఫ‌స్ట్ డోస్ తీసుకున్న వారికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని ఆదేశించింది.

వంట‌గ్యాస్ స‌ప్లై చేసేవారు, రేష‌న్ డీల‌ర్లు, పెట్రోల్ బంకుల్లో ప‌ని చేసే వారు, ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్లు, కూర‌గాయ‌లు, పండ్లు అమ్మేవారు, మార్కెట్‌ల‌లో హ‌మాలీలు, కిరాణా, మాంసం దుకాణాల్లో ఉండేవారు, వైన్స్‌లో ప‌ని చేసేవారు, హోట‌ళ్లు, సెలూన్ల‌లో ప‌ని చేసే వారు, ఎరువుల దుకాణాల్లో ప‌ని చేసేవారు, పూజారులు, ప‌త్రికా, టీవీ ఛాన‌ళ్ల విలేక‌రులు సూప‌ర్ స్ప్రెడ‌ర్లుగా ప్ర‌భుత్వం గుర్తించింది. వీరే ఎక్కువ‌గా క‌రోనా బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తోంది.

ఇక నుంచి ముందుగా వీరికే క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు. వీరు 30 ల‌క్ష‌ల మంది ఉంటార‌ని ప్ర‌భుత్వం గుర్తించింది. వీరిని గుర్తించి వ్యాక్సిన్ వేయ‌డానికి ప్ర‌త్యేక కేంద్రాల‌ను సైతం ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌తో ప్ర‌భుత్వం ఉంది. ఇందుకు సంబంధించిన కార్య‌చ‌ర‌ణ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ 18 ఏళ్ల పైబ‌డిన అంద‌రికీ జ‌రుగుతుంది. కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకొని ప్రైవేటులో వ్యాక్సిన్ తీసుకోవాలి.

Related News