పోలీస్ ఉద్యోగాలను ఆశిస్తున్న యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. పోలీస్ ఉద్యోగాల వయో పరిమితిని రెండేళ్లు పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల వయో పరిమితి పెంచాల్సిందిగా ఆయన డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్ల పాటు కరోనా సంక్షోభం ఉండటం, కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి కాబట్టి వయో పరిమితి పెంచాల్సిందిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ను కోరారు. ఆయన వినతి మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.