రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. దివ్యాంగులకు అవసరమైన పరికరాలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. అందుకోసం 20కోట్ల 41లక్షలతో వారికీ అవసరమైన ఉపకరణాలను కొనుగోలు చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 13,195మందికి వీటిని ఉచితంగా అందించనున్నారు.
ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి దివ్యాంగులకు పట్ల ప్రేమ, ఆదరణ ఉన్నాయన్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఏటా 18 వందల కోట్లతో ఫించన్లను అందిస్తుందన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలను అందిస్తుందన్నారు.
దేశంలోనే ఇలాంటి కార్యక్రమం ఇదొక్కటేనన్నారు. అయితే అర్హులైన దివ్యాంగ అభ్యర్థులు ఈరోజు నుంచి ఫిబ్రవరి 6 లోపు ఆన్ లైన్ లో వీటి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఒక్కొక్కటి 90వేల రూపాయలు విలువ చేసే రెట్రోఫిట్టెడ్ త్రిచక్రవాహనాలు-900
బ్యాటరీ వీల్ఛైర్స్-650
లాప్టాప్స్-300
4జీ స్మార్ట్ ఫఫోన్స్ -400
వినికిడి యంత్రాలు-1460
చేతికర్రలు-2065
ఎంపీ3 ప్లేయర్స్-800
వీల్ ఛైర్లు-2వేలు
చంకకర్రలు -3 వేలుహనాలు
త్రిచక్ర వాహనాలు-15వందలు
డైసీ ప్లేయర్స్ -120 పంపిణీ చేస్తామని ఆయన అన్నారు.
www.obmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.జిల్లా కమిటీలు ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ఫిబ్రవరి 15 నుంచి ఉపకరణాలను అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉచితంగా అందజేయనున్నారు.