మందు బాబులకు తెలంగాణ ప్రభత్వం శుభవార్త వినిపించింది. కొత్త సంవత్సరం కానుకగా ఒక ప్రకటనను విడుదల చేసింది. రేపు అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని పేర్కొంది. మద్యం షాపులతో పాటుగా బార్లు, క్లబ్బులకు కూడా డిసెంబర్ అర్థరాత్రి 1గంట వరకు అనుమతిస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బహిరంగంగా కొత్త సంవత్సరం వేడుకల్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంక్షలు పాటించని మద్యం షాపులు క్లబ్బులప కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఆంక్షల్లో సడలింపులు ఇస్తూ డిసెంబర్ అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకలకు అనుమతులు ఇచ్చింది.