యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాగా పాపులర్ అయిన ‘దేత్తడి’ హారిక ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా హరికకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా హరికను నియమించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్ లో కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ ఛైర్మెన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా హరికకు నియామక పత్రాన్ని అందించారు.
ఈ విషయాన్ని తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. తనను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నందుకు హారిక తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ యాసతో యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హారిక బిగ్ బాస్ రియాలిటీ షోలో టాప్ 5 లిస్టులో నిలిచింది. తన యాటిట్యుడ్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు.
ఈ సందర్భంగా హరికకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ సినిమాల్లో హీరోయిన్ గా నటించాలనేది తన కల అని మనసులో మాట బయటపెట్టింది. మంచి కాన్సెప్ట్ తో పాటుగా నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించాలని ఉందని హారిక తెలిపింది. ప్రస్తుతం ‘వరుడు కావలెను’ అనే సినిమాతో పాటుగా తనకు లైఫ్ ఇచ్చిన టిట్యూబ్ ఛానెల్ లో మరో వెబ్ సిరీస్ లో నటిస్తుంది హారిక.