logo

  BREAKING NEWS

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త!  |   అయోధ్య మసీదుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!  |   మహారాష్ట్ర – కర్ణాటకకు మధ్య ఏమిటీ ‘బెల్గాం’ వివాదం?  |   తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక ? ఆ ఎమ్మెల్యే రాజీనామా ఖాయం..?  |   మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి చిరంజీవి..? త‌మ్ముడి వెంట అన్న..?  |   బైడెన్ సంచలన నిర్ణయం.. ప్రవాస భారతీయులకు భారీ ఊరట!  |   పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |  

కొత్త రకం కరోనా పై తెలంగాణ సర్కార్ అలెర్ట్: ప్రజలకు కీలక సూచనలు!

యూకే లో కొత్తరకం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. గత రెండు మూడు వారాలుగా విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి సమాచారాన్ని సేకరించింది. వారందరినీ ఐసొలేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు పలు కీలక సూచనలు చేసారు. అంతర్జాతీయ విమానాల్లో రెండు వారాలుగా రాష్ట్రానికి వచ్చిన వారందరినీ మానిటరింగ్ చేస్తున్నామన్నారు.

తాము సేకరించిన వివరాల ప్రకారం ఈ వారంలో యూకే నుంచి 358 మంది తెలంగాణకు వచ్చారన్నారు. నిన్న ఒక్కరోజులో ఏడుగురు వచ్చారన్నారు. అయితే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించామని ఎవరూ కూడా ఈ కొత్త రకం కరోనా బారిన పడలేదని స్పష్టం చేసారు. ప్రజలెవరూ కొత్త రకం కరోనాపై ఆందోళన చెందవద్దని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ సూచించారు. కరోనా లాంటి వైరస్ లు వచ్చినప్పుడు వాటిలో మ్యుటేషన్ లు రావడం సహజమేనన్నారు. కాగా తెలంగాణాలో కరోనా అదుపులోనే ఉందని ఆయన వివరించారు.

విదేశాల నుంచి వచ్చిన వారంతా హోమ్ క్వారెంటైన్ లో ఉండాలని ఆయన సూచించారు. ఈ వారం రోజుల వ్యవధిలో కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినవారంతా 040- 24651119 నంబరుకు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు. కాగా మరో నాలుగు వారాల్లో కరోనాకు వాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజలెవరూ విందులు, వినోదాలలో పాల్గొనవద్దన్నారు. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలకు కూడా ప్రజలు దూరంగా ఉండాలన్నారు.

Related News