logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

తెలంగాణ రైతు ఖాతాలో రూ. 473 కోట్లు.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బ్యాంకు అధికారులు!

తెలంగాణకు చెందిన ఓ సాధారణ రైతు ఖాతాలో రాత్రికి రాత్రే రూ. 473 కోట్లు వచ్చి చేరాయి. అంత డబ్బు తన ఖాతాలో చూసి ఆ రైతు ఖంగుతిన్నాడు. ఆ డబ్బు ఎక్కడిది, తన ఖాతాలోకి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. ఈ ఘటనలో చివర్లో బ్యాంకు అధికారులు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన అనుమూల సంజీవ రెడ్డి ఓ సాధారణ రైతు.

బుధవారం రోజు పొలం పనుల కోసం పక్కనే ఉన్న సిద్ధిపేట జగదేవ్ పూర్ కి వెళ్ళాడు. తనకు కొంత డబ్బు అవసరం ఉండగా స్థానికంగా ఉన్న డీసీసీబీ ఏటీఎం కు వెళ్లి డబ్బు డ్రా చేయబోయాడు. ఎంతకీ ఏటీఎం లో నుంచి డబ్బు రాలేదు. అసలు ఖాతాలో డబ్బులు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఏటీఎం ఇచ్చే రిసీప్ట్ ను పరిశీలించాడు. అంతే అందులో ఉన్న సంఖ్య చూసి షాకయ్యాడు.

తన ఖాతాలో ఏకంగా రూ. 473,13,30,000 ఉండటం చూసి కంగారు పడ్డాడు. అనుమానం వచ్చి దగ్గర్లో ఉన్న మరో ఏటీఎం కి వెళ్లి చెక్ చేసాడు. అక్కడ కూడా అదే చూపిస్తుంది. తెలిసిన వారి దగ్గరకు వెళ్లి ఆ రిసీప్ట్ చూపించగా తన ఖాతాలో రూ. 473 కోట్లు ఉన్నాయని చెప్పారు. అయితే ఖాతాలో అన్ని కోట్లు ఉన్నా ఏటీఎం లో డ్రా చేద్దామంటే డబ్బు రావడం లేదు.

దీంతో గ్రామీణ బ్యాంకుకు వెళ్లి ఆరా తీసాడు. తనకు ఏటీఎం లో డబ్బు ఎందుకు రావడం లేదని ప్రశ్నించగా సంజీవ రెడ్డి ఖాతా ఫ్రీజ్ అయ్యిందని తెలిపారు. అంతేకాదు మీ ఖాతాలో కేవలం రూ. 4 వేల చిల్లర మాత్రమే ఉందని చెప్పి బ్యాంకు అధికారులు షాకిచ్చారు. దీంతో ఏం జరుగుతుందో అతనికి పాలుపోలేదు. తన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చింది? వచ్చినా తన ఖాతా ఎందుకు ఫ్రీజ్ అయ్యింది? అనే సందేహాలు మాత్రం తీరలేదు. కానీ సంజీవ రెడ్డి విషయం మాత్రం రెండు రోజులుగా ఆ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

Related News