logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

తెలంగాణలోని ఆ జిల్లాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా..!

వాక్సిన్ అందుబాటులోకి రావడం, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా విజృంభిస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తి మళ్ళీ మొదలైంది. జిల్లాలోని చేగుర్తిలో కొద్దీ రోజుల క్రితం ఓ వ్యక్తి మరణించాడు.

అతని అంత్యక్రియల్లో భారీగా బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. వీరిలో పలువురికి కరోనా సోకింది. ఈవార్త తెలిసి అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ గ్రామంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు నిర్వహించారు. గురువారం జరిపిన పరీక్షల్లో 16 మందికి.. శుక్రవారం జరిపిన పరీక్షలో మరో 17 మందికి కరోనా సోకినట్టుగా వైద్యులు నిర్దారించారు.

మొత్తం 33 మందికి ఒకేసారి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తుంది. వీరంతా ఎవరెవరిని కలిసారనే విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో పక్క గ్రామానికి చెందిన వారు కూడా ఉండటంతో వారి నుంచి కూడా శాంపిళ్లను సేకరిస్తున్నారు. కాగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన హెల్త్ బులెటిన్ లో కరీంనగర్ జిల్లాలో కేవలం 13 కేసులు మాత్రమే ఉన్నాయని పేర్కొనడం గమనార్హం.

Related News