logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

తెలంగాణలో 17 వేల క‌రోనా బెడ్ల‌లో 15 వేలు ఖాళీ..!‌

తెలంగాణలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు రాష్ట్ర క‌రోనా బులెటిన్ చెబుతోంది. నిన్న రాత్రి విడుద‌ల కావాల్సిన బులెటిన్‌ను వైద్యారోగ్య శాఖ ఇవాళ ఉద‌యం విడుద‌ల చేసింది. రాష్ట్రంలో కొత్త‌గా 1,593 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 54,059కు చేరుకుంది. 24 గంట‌ల్లో 998 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 41,332కు చేరింది.

24 గంట‌ల్లో 15,654 టెస్టులు చేశారు. 8 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దీంతో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 463కు చేరుకుంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 12,264 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో డెత్ రేట్ 0.86 శాతంగా దేశం మొత్తం మీద 2.3 శాతంగా ఉంది. హైకోర్టు ప‌దేప‌దే ఆదేశాలు ఇస్తున్న నేప‌థ్యంలో ఇవాళ విడుద‌ల చేసిన బులెటిన్‌లో తెలంగాణ వైద్య స‌దుపాయాలు, ఖాళీగా ఉన్న బెడ్ల సంఖ్య‌ను కూడా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

రాష్ట్రంలో 11,928 ఐసోలేష‌న్ బెడ్లు అందుబాటులో ఉండ‌గా 627 బెడ్ల‌లో మాత్ర‌మే పేషెంట్లు ఉండ‌గా 11,301 బెడ్లు ఖాళీగా ఉ్న‌నాయి. 3,537 ఆక్సీజెన్ బెడ్లు అందుబాటులో ఉండ‌గా 1,190 బెడ్లలో పేషెంట్లు ఉండ‌గా 2,347 ఖాళీగా ఉన్నాయి. 1,616 ఐసీయూ బెడ్లు ఉండ‌గా 317 బెడ్ల‌లో పేషెంట్లు ఉండ‌గా 1,299 ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. గాంధీ ఆసుప‌త్రిలో మొత్తం 1,890 బెడ్లు ఉండ‌గా 815 మంది మాత్ర‌మే పేషెంట్లు ఉండ‌గా మిగ‌తా 1,075 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.

Related News