logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

త్వ‌ర‌లో ప్ర‌పంచం ఆశ్చ‌ర్య‌పోయే శుభ‌వార్త చెబుతా

ఆరు సంవ‌త్స‌రాల్లోనే తెలంగాణ ఏడాదికి ల‌క్ష కోట్ల పంట‌ను పండించే బంగారు తెలంగాణ‌, భాగ్య‌రాశుల తెలంగాణ‌, ప‌సిడి పంట‌ల తెలంగాణగా మారింద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. శుక్ర‌వారం ఆయ‌న కొండ‌పోచ‌మ్మ ప్రాజెక్ట్ ప్రారంభోత్స‌వం అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రైతాంగానికి అతి త్వ‌ర‌లోనే గొప్ప శుభ‌వార్త చెప్ప‌బోతున్న‌ట్లు తెలిపారు. భార‌త‌దేశంలోనే కాదు ప్ర‌పంచంలోనే ఎక్క‌డా రైతాంగానికి లేని శుభ‌వార్త‌ను అందిస్తామ‌ని చెప్పారు. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత భార‌త‌దేశంతో పాటు ప్ర‌పంచం మొత్తం ఆశ్చ‌ర్య‌పోతుంద‌న్నారు.

తమ ప్ర‌భుత్వం తీసుకువ‌స్తున్న కొత్త విధానం నియంత్రిత సాగు మాత్ర‌మే కానీ నియంతృత్వ సాగు కాద‌ని అన్నారు. ఈ విధానం ద్వారా దేశానికే తెలంగాణ రైతాంగం ఆద‌ర్శంగా, అద్భుతాలు సృష్టించే, ఆధునిక రైతాంగంగా మారాల‌నేది త‌న క‌ల అని పేర్కొన్నారు. తెలంగాణ‌లో ఉన్న రైతుబందు, రైతుబీమా ప‌థ‌కాలు ప్ర‌పంచంలో ఎక్క‌డా లేవ‌న్నారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణ‌లో అద్భుత‌మైన జీవ‌వైవిద్యం త‌యార‌వుతోంద‌న్నారు.

Related News