logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో కేసీఆర్ భేటీ.. ప‌లు కీల‌క హామీలు

తెలంగాణ రాష్ట్రం అన్ని మ‌తాల‌ను సమానంగా ఆద‌రిస్తుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా నూత‌న స‌చివాల‌య ప్రాంగ‌ణంలో కొత్త‌గా మ‌సీదు, మందిర నిర్మాణం చేస్తామ‌ని చెప్పారు. క్రైస్త‌వుల విజ్ఞ‌ప్తి మేర‌కు కొత్త‌గా చ‌ర్చి కూడా నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించారు. వీటి నిర్మాణానికి పూర్తిగా ప్ర‌భుత్వ‌మే ఖ‌ర్చు భ‌రిస్తుంద‌ని తెలిపారు. గంగ జ‌మునా త‌హ‌జీబ్‌కు అద్దం ప‌ట్టేలా అసెంబ్లీ స‌మావేశాల అనంత‌రం మంద‌రం, మ‌సీదు, చ‌ర్చి నిర్మాణానికి ఒకేసారి శంకుస్థాప‌న చేస్తామ‌ని తెలిపారు.

ప్రార్థినా మందిరాల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చూస్తామ‌ని పేర్కొన్నారు. 750 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఇమామ్ క్వార్ట‌ర్స్‌తో పాటు మొత్తం 1500 చ‌ద‌ర‌పు అడుగుల‌తో మ‌సీదు నిర్మాణం చేప‌డ‌తామ‌ని తెలిపారు. ఇంత‌కుముందు ఎక్క‌డైతే మ‌సీదు ఉందో అక్క‌డే మ‌ళ్లీ నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చారు. నిర్మాణం పూర్త‌యిన త‌ర్వాత మ‌సీదును వ‌క్ఫ్ బోర్డుకు అందిస్తామ‌ని, మందిరాన్ని దేవాద‌య శాఖ‌కు అప్ప‌గిస్తామ‌ని కేసీఆర్ చెప్పారు. 1500 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ప్ర‌భుత్వ ఖ‌ర్చుతో మందిరాన్ని నిర్మిస్తామన్నారు.

ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో భేటీ సంద‌ర్భంగా ముస్లిం ప్ర‌జ‌ల బాగోగుల గురించి కూడా కేసీఆర్ చ‌ర్చించారు. ముస్లిం అనాథ పిల్ల‌ల‌కు ఆశ్ర‌యం ఇచ్చి, విద్య‌నందించే అనీస్ ఉల్ గుర్భా నిర్మాణం ఇప్ప‌టికే 80 శాతం పూర్తైన‌ట్లు చెప్పారు. మ‌రో రూ.18 కోట్లు కేటాయించి ఈ నిర్మాణం మొత్తం పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో హైద‌రాబాద్‌లో ఇస్లామిక్ సెంట‌ర్‌ను నిర్మిస్తామ‌ని చెప్పారు. ఇందుకోసం స్థ‌లం కూడా కేటాయించామ‌ని, త్వ‌ర‌లోనే నిర్మాణ ప‌నులు ప్రారంభిస్తామ‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో సుమారు 150 – 200 ఎక‌రాల్లో ఖ‌బ‌ర‌స్థాన్‌ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

రోడ్డు వెడ‌ల్పులో నారాయ‌ణ‌పేట‌లోని పీరీల చావ‌డి అసుర‌ఖానాకు న‌ష్టం జ‌రిగింద‌ని, దీనికి స్థ‌లం కేటాయించి మ‌ళ్లీ కొత్త‌గా నిర్మాణం చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్‌కు ఆదేశాలిచ్చిన‌ట్లు కేసీఆర్ వివ‌రించారు. రాష్ట్రంలో ఊర్దూ భాష‌ను రెండో అధికార భాష‌గా గుర్తిస్తామ‌న్నారు. అధికార భాష సంఘంలో ఉర్దూ భాష‌కు చెందిన వ్య‌క్తిని ఉపాధ్య‌క్షులుగా నియ‌మిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఉర్దూ భాష ప‌రిర‌క్ష‌ణ, అభివృద్ధి కోసం కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌న్నారు. సీఎంతో భేటీలో హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ, ఎంఐఎం ఎంపీ అస‌దుద్దిన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బ‌రుద్దిన్ ఓవైసీ పాల్గొన్నారు.

Related News