logo

  BREAKING NEWS

గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |  

బ్రేకింగ్: తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు?

తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ఈ నెల 18 నుంచి తరగతులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర సర్కార్ సిద్దమవుతున్నట్టుగా సమాచారం అందుతుంది.

ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి తరగతులను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్టుగా సమాచారం అందుతుంది.

అయితే కేవలం 9వ తరగతి ఆపై తరగతులకు మాత్రమే తరగతులు బోధించే అవకాశం కనిపిస్తుంది. కరోనా కారణంగా గతేడాది విద్యా సంవత్సరం దాదాపుగా రద్దైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుతుండటం, పరీక్షలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Related News